
"కూలీ" సినిమాలో ఎటువంటి బోల్డ్ సీన్లు లేవు. వైలెన్స్ కూడా భయపడే రేంజ్‌లో లేదు. సాధారణంగా "A" సర్టిఫికేట్ అనేది అభ్యంతరకర సన్నివేశాలు, హద్దులు మీరిన బోల్డ్ సీన్లు లేదా అధిక స్థాయి వైలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తారు. కానీ ఈ సినిమాలో అవి లేని పరిస్థితిలో ఎందుకు "A" సర్టిఫికేట్ ఇచ్చారు అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాకి A సర్టిఫికేట్ జారీకి ముఖ్య కారణం సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలే అని తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఏ సినిమాలో అయినా దేశంలో ఉన్న ప్రైవేట్ పోర్టులను అక్రమ కార్యకలాపాలకు కేంద్రాలుగా చూపించడం నేరం. అలా చేయకూడదు. ఎందుకంటే ఇది దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
"కూలీ" సినిమా చాలా వరకు జైలులోనే షూట్ చేయబడింది. అంతేకాక, ఇందులో కొన్ని అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉండటంతో, సెన్సార్ బోర్డు ఈ సినిమాకు "A" సర్టిఫికేట్ జారీ చేసినట్లు సమాచారం. మొదట్లో లోకేష్ కనగరాజ్ అలాగే నిర్మాత కళానిధి మారన్ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే "A" సర్టిఫికేట్ కారణంగా 18 ఏళ్ల లోపు ప్రేక్షకులకు మల్టీప్లెక్స్‌లలో ఎంట్రీ ఇవ్వడం లేదు. డిస్ట్రిబ్యూటర్లు మాత్రం, "ఇకనైనా సెన్సార్ బోర్డు సూచించిన కట్స్ అమలు చేస్తే కలెక్షన్లు మరింత పెరుగుతాయి" అని భావిస్తున్నారు. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం, "తగ్గేదేలే" అన్న ధోరణిలో ముందుకు వెళ్తున్నారు. "ఎలాగో కలెక్షన్లు అదిరిపోతున్నాయి సినిమా కోసం మళ్లీ కట్స్ ఎందుకు చేయాలి" అన్న దానిపై ఆయన కట్టుబడి ఉన్నారు.