ప్రస్తుతం ఎక్కడ చూసినా వార్ 2, కూలీ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆగస్టు 14వ తేదీన బాక్స్ ఆఫీస్ వద్ద రెండు బడా సినిమాలు పోటీకొచ్చాయి. ఈ రెండు చిత్రాల్లోనూ బిగ్ స్టార్స్ నటించడం కామన్ విషయం. కూలీ చిత్రంలో రజనీకాంత్, నాగార్జున, శృతిహాసన్, ఉపేంద్ర నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా మొదటి రోజు 151 కోట్లకు పైగా కలెక్షన్ సాధించినట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాకి కాంపిటీటర్‌గా వచ్చిన వార్ 2 మాత్రం మొదటి రోజు కేవలం 90 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసినట్లు సమాచారం. దీనిపై చిత్రబృందం ఇంకా స్పందించకపోయినా, ఈ లెక్కలు దాదాపు నిజమేనని తెలుస్తోంది.


అంతేకాదు, వార్ 2, కూలీ సినిమాల కన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా హైలైట్ అవుతున్న మరో సినిమా ఉంది. ఆ సినిమా మరెవరో కాదు "మహావతార్ నరసింహ". ఇటీవల ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన యానిమేషన్ చిత్రాల్లో ఇది ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పూర్తిగా దైవత్వం, సాలిడ్ యాక్షన్, ఎమోషనల్ మూమెంట్స్‌తో దర్శకుడు అశ్విన్ కుమార్ ఈ సినిమాను అద్భుతంగా ప్లాన్ చేశారు. ఈ సినిమా విడుదలై 22 రోజులు అవుతున్నా, థియేటర్స్‌ వద్ద ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. వార్ 2, కూలీ సినిమాల కంటే ఈ సినిమాను పిల్లలు, కుటుంబాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మధ్యలో హరిహర వీరమల్లు, కింగ్డమ్ వంటి చిత్రాలు వచ్చినా, వాటిని అధిగమించి ఈ సినిమా థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.



బుక్ మై షో బుకింగ్ డేటా ప్రకారం .. వార్ 2కి గంటకు 60 వేలకుపైగా టికెట్లు, కూలీకి దాదాపు 39 వేల టికెట్లు విక్రయమవుతుంటే, మహావతార్ నరసింహకు 20 వేల టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇది కొత్త సినిమాలతో పోలిస్తే 22వ రోజు కూడా ఇంత సత్తా చాటడం నిజంగా గొప్ప విషయం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఈ సినిమాలో ఎలాంటి స్టార్స్ లేకపోయినా, కేవలం దైవత్వం, కంటెంట్ బలం, యానిమేషన్‌ శక్తితో రెండు బడా స్టార్ హీరోల సినిమాలకు సమానంగా పోటీ ఇస్తోంది. ప్రేక్షకులు కూడా ఇదే నిజమైన దైవత్వం అంటున్నారు. ఈ డామినేషన్ పూర్తిగా వేరే లెవెల్‌లో ఉందని అంటున్నారు. వసూళ్ల పరంగా కూడా మహావతార్ నరసింహ ఎక్కడ తగ్గేలా లేదు. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద డబుల్ సెంచరీ క్రాస్ చేసి, కూలీ, వార్ 2 చిత్రాలకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు దూసుకుపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: