వాట్సప్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరి మొబైల్ లో కూడా దాదాపుగా ఉంటుంది. వాట్సప్ రాక ముందు ఒక వ్యక్తితో చాటింగ్ చేయాలి అంటే ఎంతో కష్టంగా ఉండేది. మెసేజ్ చేయడం కోసం పెద్ద మొత్తం లో డబ్బులు కూడా ఖర్చు అయ్యేవి. కానీ వాట్సాప్ ఎప్పుడు అయితే వచ్చిందో అప్పటినుండి మెసేజ్ పంపడం అనేది అత్యంత సులభంగా మారిపోయింది. దానితో పెద్ద మొత్తంలో ప్రజలు వాట్సాప్ ను వినియోగిస్తూ వస్తున్నారు. ఇకపోతే వాట్సప్ ద్వారా మెసేజ్లు పంపడం మాత్రమే కాకుండా , అనేక రకాలైన సౌకర్యాలు కూడా ఉండడంతో వాట్సప్ వినియోగం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. కొంత మంది వాట్స్ అప్ ను కేవలం మొబైల్లో మాత్రమే కాకుండా కొన్ని పనుల కోసం కంప్యూటర్లలో కూడా వాడుతూ ఉంటారు.

దానితో మొబైల్ నుండి వాట్సాప్ ద్వారా కంప్యూటర్లలో తమ వాట్సాప్ లోకి లాగిన్ అవుతుంటారు. అది ప్రమాదం అని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కోరింది. అసలు విషయం లోకి వెళితే ... మీరు ఏదైనా కంపెనీ లో లేదా సంస్థలో పని చేస్తున్న సమయంలో మీరు మీ వాట్సాప్ ను ఆ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ద్వారా లాగిన్ అవుతుంటారు. అలా లాగిన్ అయిన సందర్భంలో మీకు సంబంధించిన సున్నితమైన డాటాను ఆ కంపెనీ వారు చూసే అవకాశం ఉంటుంది.

దాని ద్వారా మీ ప్రైవసీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కొన్ని సమస్యలలో కూడా పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీరు కంపెనీ లో పని చేస్తున్న లేదా ఏదైనా సంస్థలో పని చేస్తున్న వారికి సంబంధించిన కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయకుండా ఉంటే బెటర్ అని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కోరింది. ఒక వేళ కచ్చితంగా మీరు వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్ ను కంప్యూటర్ లో వాట్సాప్ వెబ్ ద్వారా ఓపెన్ చేయాల్సిన అవసరం వస్తే మీరు వెళ్లిపోయే సమయంలో కచ్చితంగా వాట్సాప్ వెబ్ నుండి లాగౌట్ అవ్వాలి అని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: