ఈ సంవత్సరం ఇప్పటివరకు మన తెలుగు సినీ పరిశ్రమ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు హిట్టు , ఫ్లాపు టాక్ తో సంబంధం లేకుండా విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం విడుదల అయిన మొదటి రోజు సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 3 మూవీస్ ఏవి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

హరిహర వీరమల్లు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నీది అగర్వాల్ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం జూలై 24 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడడం లేదు. కానీ ఈ సినిమా మొదటి రోజు సీడెడ్ ఏరియాలో మాత్రం 5.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి సీడెడ్ ఏరియాలో ఈ సంవత్సరం అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

గేమ్ చెంజర్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్గా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కానీ విడుదల అయిన మొదటి రోజు సిడెడ్ ఏరియాలో  5.82 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం సిడెడ్ ఏరియాలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండో స్థానంలో నిలిచింది.

డాకు మహారాజ్ : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా సిడెడ్ ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసి ఈ సంవత్సరం సిడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: