కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ అనే సినిమాలో హీరోగా నటించాడు. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునమూవీ లో విలన్ పాత్రలో నటించగా... శృతి హాసన్ , సత్యరాజ్ , ఉపేంద్రమూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. అమీర్ ఖాన్ ఈ సినిమాలో చిన్న క్యామియో పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఆగస్టు 14 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు కాస్త మిక్స్ డ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం కాస్త తక్కువ ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ భారీ కలెక్షన్లను అందుకుంటుందా ..? లేదా అనేది మొదటి వీక్ డే అయినటువంటి సోమవారం రోజు తెలిసే అవకాశం ఉంది. సోమవారం మంచి కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో  రెండు రోజుల్లో 24.75 కోట్ల షేర్ ... 35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 21.25 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబడితే ఈ సినిమా క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 124.50 షేర్ ... 245.55 గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 307 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 182.50 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: