
కొంత కాలం క్రితం వెంకటేష్ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి రాస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా వెంకటేష్ కు మంచి విజయం దక్కింది. మొదట అనిల్ రావిపూడి "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాని వెంకటేష్ తో కాకుండా చిరంజీవితో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా చిరంజీవికి కథను కూడా వినిపించాడట. కానీ చిరంజీవి ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో అనిల్ , వెంకటేష్ కు ఈ కథను వినిపించగా వెంకటేష్ మాత్రం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా చిరు రిజక్ట్ చేసిన స్టోరీ తో వెంకటేష్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.