బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీలలో సైతం అమీర్ ఖాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ పై అతని సోదరుడు ఫైసల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమీర్ ఖాన్ బ్రిటిష్ జర్నలిస్ట్ అయిన జెస్సికా హైన్స్ అనే అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడని ఫైసల్ ఖాన్ అన్నారు. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనాతో ఉన్న సమయంలోనే జెస్సికాతో వివాహేతర సంబంధం ఉందని చెప్పుకొచ్చారు.

రీనాతో విడాకులు తీసుకున్న  అమీర్ ఖాన్ జెస్సికాతోనే  ఉండేవారని చెప్పుకొచ్చారు.  అయితే వారిద్దరూ  కేవలం రిలేషన్ షిప్  లో మాత్రమే ఉన్నారని పెళ్లి చేసుకోలేదని ఫైసల్  ఖాన్ తెలిపారు.  అయితే అమీర్ ఖాన్ కొంతకాలం తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడని అప్పటికీ జెస్సికాతో టచ్ లో ఉండేవాడని  ఆయన అన్నారు.  1990 సంవత్సరంలో అమీర్ ఖాన్ జెస్సికా మధ్య ఏదో ఉందని  కొన్ని మీడియా కథనాలు ప్రసారమయ్యాయి.

జెస్సికా హైన్స్  కు ఒక కొడుకు ఉన్నాడు.  అతని పేరు జాన్ అని ఆ కథల ద్వారా వెల్లడవుతోంది.  అయితే అమీర్ ఖాన్ మాత్రం ఈ విషయాల గురించి ఎప్పుడూ  స్పందించలేదు.  జెస్సికా మాత్రం పలు సందర్భాల్లోఈ విషయం గురించి  ప్రస్తావించినట్టు తెలుస్తోంది.  అయితే సోదరుడు  చేసిన కామెంట్ల గురించి ఆమీర్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

అమీర్ ఖాన్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.  అమీర్ ఖాన్ ను  అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.  అమీర్ ఖాన్ కూలీ సినిమాలో కీలక పాత్రలో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. అమీర్ ఖాన్ పై ఈ ఆరోపణలు రావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: