జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన దేవర సినిమా గత ఏడాది విడుదలై అభిమానులను బాగానే ఆకట్టుకుంది.ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించింది.అయితే చివరిలో దేవర 2 ఉంటుందనే విషయంపై ప్రకటించారు. ఇక సెకండ్ పార్ట్ లో ఏముంటుందనే విషయంపై తెలుసుకోవడానికి అటు ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. కానీ గత కొద్దిరోజులుగా దేవర 2 సినిమా ఆగిపోయిందని ఈ సినిమా వదిలేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా క్యాన్సిల్ కావడంతో ఎన్టీఆర్ , డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారని ప్రచారం కూడా జరిగింది. దీంతో తాజాగా దేవర 2 పై వినిపిస్తున్న రూమర్స్ కి చిత్ర బృందం చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే దేవర 2 సినిమాని తెరకెక్కించేలా ప్లాన్ చేశారట. ఇందుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులలో కూడా కొరటాల శివ బిజీగా ఉంటున్నారని వినిపిస్తున్నాయి.
ఈ సినిమా నిలిచిపోయిందని విషయం మాత్రం కేవలం రూమర్స్ అని .. రీసెంట్ గా సినిమా స్క్రిప్టును కూడా ఎన్టీఆర్ కు వినిపించారట కొరటాల శివ. ఇలా ఆగిపోయిన రూమర్స్ కి చెక్ పెట్టేశారు చిత్రం బృందం. ఇందుకు సంబంధించి అభిమానులు కూడా దేవర 2 లేదన్నది ఎవరు అనే కామెంట్ ని కూడా తెగ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి దేవర 2 సినిమా ఉంటుందని విషయాన్ని తెలియడంతో అభిమానులు కూడా కొంతవరకు ఆనందపడుతున్నారు. మరి ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే వార్ 2 చిత్రంతో పరవాలేదు అనిపించుకున్నారు ఎన్టీఆర్.