సింగర్స్ గా పరిచయమైన వీరి ప్రయాణం ప్రేమగా మారి పెళ్ళి వరకు వెళ్ళింది.అలా ఈ జంట పెద్దల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ కూతురు కూడా పుట్టింది. కానీ సడన్గా ఏమైందో ఏమో కానీ గత రెండు మూడు సంవత్సరాల నుండి ఈ జంట అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా కలిసి కనిపించకపోవడం,వెకేషన్ లకి వెళ్ళినా కూడా ఒక్కొక్కరే కనిపించడం జరగడంతో వీరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది.ఈ విడాకుల వార్తలపై ఇప్పటివరకు ఏ ఒక్కరు స్పందించలేదు.  అయితే తాజాగా ఈ విడాకుల వార్తలపై ఫైర్ అయ్యారు మేల్ సింగర్..ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వాళ్లే శ్రావణ భార్గవి, హేమచంద్ర..గత కొద్ది రోజులుగా వీరు విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి శ్రావణ భార్గవి గానీ హేమచంద్ర గానీ తెర దించలేదు. 

ఇదిలా ఉంటే తాజాగా హేమచంద్రయూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్  విడాకులకు సంబంధించిన ప్రశ్న అడిగారు. దానిపై హేమచంద్ర ఫైర్ అవుతూ.. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న వల్ల ఎవరికైనా ఉపయోగముందా.. ఏదైనా ప్రశ్న అడిగితే దాని వల్ల ఏదైనా ఉపయోగం ఉండాలి.. నేను చెప్పే ఆన్సర్ వల్ల మీకు ఏమైనా పనికొస్తుందా అనేది ఆలోచించాలి. ఏది తెలియకుండా ప్రశ్నలు అడగకూడదు.చాలామంది సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఏవేవో మాట్లాడుతుంటారు.కానీ నాకు అలాంటిది నచ్చదు.సింగర్ గా నేను అందరికీ తెలుసు. నా సింగింగ్ గురించి మాట్లాడు.. సోషల్ మీడియాలో వచ్చే బేవార్స్ మాటలకు నేను స్పందించను. నెట్టింట్లో వచ్చే మాటలు నేను కేర్ చేయను. ఆ మాటలు నన్ను ప్రభావితం చేయవు. మిగతా వాళ్ళు అనే మాటలు నాకు పట్టించుకునేంత టైం లేదు. ఎవరైనా ఈ ప్రశ్న గురించి ఆన్సర్ తెలుసుకోవాలి అనుకుంటే A అండ్ Q అనే ఒక సెషన్ పెడతా..

ఈ ప్రశ్న ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటున్నారో  ప్రశ్నిస్తే..ఎవరైనా ఆన్సర్ చెప్తే ఆ ఆన్సర్ నాకు నచ్చితే నేను సమాధానం ఇస్తా. నువ్వు ఒకరికి ఏదైనా వర్క్ లో తెలిస్తే ఆ వర్క్ గురించే మాట్లాడాలి. కానీ వారి పర్సనల్స్ లో తల దూర్చకూడదు. ప్రతి ఒక్కరిలో పక్కనోడి లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిపోతుంది. ఒకవేళ నా పర్సనల్ లైఫ్ తెలుసుకోవాలి అనుకుంటే సమయం ఉన్నప్పుడు చెబుతా.. అప్పటి వరకు వెయిట్ చెయ్ అంటూ హేమచంద్ర విడాకుల వార్తలపై గట్టిగా ఫైర్ అయ్యారు. ఇక హేమచంద్ర మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్  అవ్వడంతో చాలామంది నెటిజెన్లు హేమచంద్ర శ్రావణ భార్గవి మధ్య దూరం పెరిగింది కాబట్టే ఆయన ఇలా మాట్లాడారు. ఒకవేళ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోతే సూటిగా సుత్తి లేకుండా అలాంటిదేమీ లేదు..మేము కలిసే ఉన్నామని చెప్పేవారు.కానీ ఇదంతా సోది పెట్టారంటే కచ్చితంగా ఆయన విడిపోయారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: