కవ్వించే అందం ఉన్న అదృష్టం లేక ఆఫర్లు రాక సతమతమవుతున్న హీరోయిన్ల జాబితాలో నభా నటేష్ ఒకరు. కన్నడ భామ అయినప్పటికీ తెలుగు సినిమాలతోనే ఈ బ్యూటీ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ లోనే పాగా వేసి భారీ స్టార్డమ్ సొంతం చేసుకోవాల‌ని ఆశపడింది. కానీ ఆమెకు నిరాశే ఎదురయింది.
2018లో `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నభా నటేష్.. `ఇస్మార్ట్ శంకర్` తో ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయ్యింది. అయితే క‌థ‌ల ఎంపిక‌లో చేసిన పొరపాట్ల వ‌ల్ల‌ నభా నటేష్ ను ఫ్లాపులే ప‌ల‌క‌రించాయి.
అందుకు తోడు చిన్న యాక్సిడెంట్ కారణంగా కొంతకాలం సిల్వ‌ర్ స్క్రీన్ కి న‌భా న‌టేష్‌ దూరమైంది. ఆ తర్వాత యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. కానీ సక్సెస్ రేటు సరిగ్గా లేకపోవడం, కొత్త హీరోయిన్ నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో న‌బా నటిష్ కు అవకాశాలు కరువయ్యాయి.
దాదాపు రెండేళ్ల నుంచి ఒళ్ళు దాచుకోకుండా ఎన్ని రకాలుగా అందాలు ఆర‌బోస్తున్న‌ప్పటికీ ఫలితం మాత్రం ఉండడం లేదు. కనీసం టైర్ 2 హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిఖిల్ తో `స్వయంభు` చిత్రంలో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ క్రేజీ ఫోటోషూట్ తో కుర్ర‌కారు గుండెల్లో కాక రేపుతుంది.
తాజాగా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ స్టైల్‌లో ఫోటోషూట్ చేసింది. గ్యారేజీలో కార్ రిపేర్ చేస్తున్నట్టుగా ఒంటిపై ఆయిల్ పోసుకొని ఫోటోల‌కు పోజులిచ్చింది. క్రేజీ అవుట్‌ఫిట్‌ లో నభా లుక్స్ సూపర్ టెంప్టింగ్ గా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. న‌భా లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: