యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ను అనవసర వివాదాల్లోకి లాగితే మాత్రం అస్సలు ఊరుకోరు. అనంత‌పురం అర్బ‌న్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్ర‌సాద్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో చేసిన కామెంట్స్ అభిమానులను ఎంతగానో హర్ట్ చేశాయనే సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు తాము ఊరుకోమని ఫ్యాన్స్ చెబుతున్నారు.

అయితే అనంత‌పురం అర్బ‌న్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్ర‌సాద్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు.  ఇలాంటి సమయంలో ఎవరూ  ఊహించని విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్  ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేకు అల్టిమేటం జారీ చేశారు.  అందరి ముందు జూనియర్ ఎన్టీఆర్ తల్లికి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని  తారక్ ఫ్యాన్స్ కోరారు.  తాము ఇలాంటివి చూస్తూ అస్సలు ఊరుకోమని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో ఆయన తిట్టిన బూతులను  జనాలకు చేరవేస్తామని చెప్పుకొచ్చారు.  జూనియర్ ఎన్టీఆర్ కూడా టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని  టీడీపీ  ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ ఫ్యాన్స్ ప్రశ్నించారు.  చంద్రబాబు, లోకేష్ కు ఈ వివాదంతో సంబంధం లేదని తాము భావిస్తున్నామని ఫ్యాన్స్ అభిప్రాయం  వ్యక్తం చేయడం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.  యంగ్  టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్యా పెరుగుతోంది. కెరీర్ పరంగా  తారక్ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలనీ ఈ హీరో అభిమానులు భావిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: