శ్రీలీల నటించిన మాస్ జాతర మూవీసెప్టెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యం లోనే తాజాగా బుల్లితెర లో ప్రసారమయ్యే ఓ టాక్ షో కి వచ్చి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. మరి ఇంతకీ ఆ టాక్ షో ఏంటయ్యా అంటే జగ్గూ భాయ్ హోస్టుగా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా.. జగతి బాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా ఈ మధ్యనే స్టార్ట్ అయింది. ఈ షో కి ఫస్ట్ గెస్ట్ గా నాగార్జున కూడా వచ్చారు. ఇక సెకండ్ గెస్ట్ గా శ్రీలీలను తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటికే శ్రీలీల ఈ  షో కి వచ్చిన ప్రోమో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రోమో తోనే ఈ ఎపిసోడ్ పై అంచనాలను పెంచేశారు.
 
 అయితే ఈ ప్రోమోలో శ్రీ లీల జగపతిబాబుని బెదిరించిన ఒక విషయం వైరల్ అయింది. అదేంటంటే జగపతి బాబు శ్రీ లీల రావడంతోనే ఎన్నో పంచ్ లు విసిరేస్తారు. ఇక ఆ పంచ్ లకు తగ్గట్టుగానే శ్రీలీల కూడా ఆన్సర్ ఇస్తుంది. అలాగే శ్రీలీల గురించి ఇంకా ఎన్నో విషయాలు అడగాలి.. ఎన్నో విషయాలు బయట పెట్టాలి అని చెబుతారు. ఆ తర్వాత జగపతి బాబు ఏదో ప్రశ్న అడగగా..

ఇప్పుడు ఆ విషయం మీరు బయట పెడితే మీరు ఆ సినిమా షూటింగ్లో హీరోయిన్ తో ఉన్న మేటర్ లీక్ చేస్తా అంటూ శ్రీ లీల షాక్ ఇచ్చింది. అయితే శ్రీలీల జగపతి బాబుకి సంబంధించి ఏం విషయం లీక్ చేస్తానని చెప్పిందో తెలియదు. ఇక ఈ విషయం తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ తన వయసు లో సగం కూడా లేని శ్రీలీల జగపతి బాబుకే మీ మేటర్ లీక్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన ప్రోమో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: