టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్థాయిలో కెరియర్ను నటుడిగా ముందుకు సాగిస్తున్న సమయంలోనే జనసేన అనే ఓ రాజకీయ పార్టీని స్థాపించాడు. ఈ రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఇక రాజకీయాలతో బిజీ కావడం వల్ల సినిమాల సంఖ్యను కూడా చాలా వరకు తగ్గించాడు. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పవన్ స్థాపించిన జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పవన్ కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఆ సినిమాలను ప్రస్తుతం పూర్తి చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా పూర్తి అయ్యింది. విడుదల కూడా అయింది. మరి కొంత కాలంలోనే ఓజి , ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో కూడా విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అంటే చాలు ఆయన అభిమానులు ఆయన పుట్టిన రోజులు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వచ్చింది అంటే చాలు ఆయన నటించిన చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తేదీన ఆయన నటించిన మంచి విజయం సాధించిన సినిమాలలో ఒకటి అయినటువంటి జల్సా మూవీ ని రీ రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఓజి , భగత్ సింగ్ మూవీలకి సంబంధించిన అప్డేట్లను కూడా పవన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా పవన్ పుట్టిన రోజు సందర్భంగా అదిరిపోయే రేంజ్ అప్డేట్లు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk