- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాల రీలీజ్‌కు ముందు నుంచే ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంటుంది. అలాంటి హైప్‌తో వచ్చిన తాజా చిత్రం ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్‌ పై తమిళ సినీ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా మొత్తం దక్షిణాది ప్రేక్షకుల్లోనూ ఆతృత నెలకొంది. ట్రైలర్, టీజర్ దశలోనే సినిమా వందల కోట్ల వసూళ్లు సాధిస్తుందని విశ్లేషకులు చెప్పేశారు. ప్రత్యేకించి, రజనీకాంత్ - లోకేష్ కలయిక వల్ల ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఫ‌స్ట్ రు. 1000 కోట్ల త‌మిళ సినిమాగా రికార్డుల్లోకి ఎక్క‌డం ఖాయం అని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.



అయితే అంచనాలు ఎంత ఎత్తులో ఉన్నా రిజ‌ల్ట్ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోయింది. మొదటి మూడు రోజులు, అంటే తొలి వీకెండ్‌లో మాత్రం అభిమానుల హంగామాతో మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ వర్కింగ్ డేస్ మొదలైన వెంటనే కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఇప్పటి వరకు కూలీ సినిమా రు. 500 కోట్ల మార్క్ కూడా దాటలేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంత భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా ఎందుకు అంచనాలను అందుకోలేకపోయింద‌న్న‌ ప్రశ్న పరిశ్రమలో చర్చనీయాంశమైంది.


కథలో కొత్తదనం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. యాక్షన్, స్టైల్ ఉన్నా, ప్రేక్షకులకు కావాల్సిన ఎమోషనల్ కనెక్ట్ లోపించిందనే అభిప్రాయం వినిపిస్తోంది. రజనీకాంత్ ఇమేజ్‌కి తగ్గ హై వోల్టేజ్ సన్నివేశాలు ఉన్నా.. స్టోరీ ప్రెడిక్టబుల్‌గా ఉండటంతో సాధారణ ప్రేక్షకుల్లో అంతగా సానుభూతి రేకెత్తించలేకపోయింది. భారీ క్యాస్టింగ్ ఉన్నా, అందరికీ తగిన స్కోప్ ఇవ్వలేకపోవడం మరో మైనస్ పాయింట్‌. రెండో సగం లో నేరేషన్ నత్తనడకన సాగడం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గిపోయింది. ఫలితంగా, మొదట అంచనా వేసిన రేంజ్‌లో వసూళ్లు సాధించలేకపోయింది. ఏదేమైనా ర‌జనీకాంత్ - లోకేష్ కాంబోపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకినా, ఫలితం మాత్రం అంచనాలకు తగ్గట్లే రాలేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: