
ముఖ్యంగా బాలీవుడ్లో హీరోయిన్ల పరిస్థితి అక్కడ మేల్ డామినేషన్ పైన మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది ప్రియాంక చోప్రా. ఇండస్ట్రీలో మగవారి ఆదిపత్యం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.. సెట్లో మేము హీరోలతో సమానంగా కష్టపడుతూ ఉంటాము వారు ఎంత కష్టపడతారో అంతేలా మేము కూడా కష్టపడతాం.. కానీ రెమ్యూనరేషన్ విషయంలో ఆ సమానత్వం ఎక్కడా కనిపించదని హీరోలతో పోలిస్తే మాకు పదో వంతు కూడా ఇవ్వరు అంటూ తెలిపింది. కొన్ని సందర్భాలలో సినిమా షూటింగ్ సెట్లో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తూ ఉంటే వాటిని కూడా హీరోలే నిర్ణయిస్తారని తెలిపింది.
కానీ హాలీవుడ్ లో మాత్రం ఇలాంటి సిస్టం లేదని తెలిపింది ప్రియాంక చోప్రా. అలాగే కెరియర్ ప్రారంభంలో కూడా తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని తెలిపింది. ముఖ్యంగా తాను రంగులో కాస్త డార్క్ గా ఉండడం వల్ల తన మీద చాలామంది విమర్శలు చేశారని.. రంగు తక్కువ అని స్క్రీన్ పై బాగోనని కామెంట్స్ చేసే వారని వెల్లడించింది. దానివల్లే చాలా అవకాశాలు కోల్పోయానని అప్పుడు తోటి నటీనటుల కంటే ఎక్కువగా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది ప్రియాంక చోప్రా. అయితే హాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని అక్కడ సమానత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది.