ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం నుంచి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు మ‌రో వార‌సుడు ప‌రిచ‌యం కాబోతున్నాడు. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అన్నయ్య, రమేష్ బాబు త‌న‌యుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా సిల్వ‌ర్ స్క్రీన్‌పై అడుగుపెట్టేందుకు సిద్ధం అయ్యాడు. యాక్టింగ్ తో స‌హా ప‌లు అంశాల్లో ఇప్ప‌టికే శిక్ష‌ణ పొందిన జ‌య‌కృష్ణ త‌న డెబ్యూ ఫిల్మ్ ను `ఆర్ఎక్స్ 100` ఫేమ్ అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడ‌ని బ‌లంగా టాక్ న‌డుస్తోంది.


వైజ‌యంతి మూవీస్‌, ఆనంద్ ఆర్ట్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ ప్రాజెక్ట్ తో మ‌రో స్టార్ కిడ్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ట‌. ఆమెనే రాషా త‌డానీ. ఈ సుంద‌రి మ‌రెవ‌రో కాదు సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కుమార్తె. 90వ ద‌శ‌కంలో యువ‌త క‌లల రాకుమారిగా ఓ వెలుగు వెలిగిన‌ ర‌వీనా తెలుగు ప్రేక్ష‌కుల‌కూ సుప‌రిచిత‌మే. ఈ న‌టి టాలీవుడ్ లో బాలకృష్ణతో `బంగారు బుల్లోడు`, నాగార్జ‌న‌తో `ఆకాశ వీధిలో`, మోహన్ బాబుతో `పాండవులు పాండవులు తుమ్మెద` వంటి చిత్రాలు చేసింది.


ఇప్పుడు ర‌వీనా కుమార్తె రాషా త‌డానీ తెలుగు ఆడియెన్స్‌కు హాయ్ చెప్ప‌బోతుంది. ఆల్రెడీ రాషా బాలీవుడ్ లో త‌న కెరీర్ ప్రారంభించింది. అజయ్ దేవగణ్ కుమారుడు అమన్ దేవగణ్ కు జోడిగా `ఆజాద్` మూవీలో యాక్ట్ చేసి వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రాషా.. నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కావాల్సి ఉంది. కానీ మోక్ష‌జ్ఞ డెబ్యూ ఫిల్మ్ ఆగిపోయిన‌ట్లు టాక్ ఉంది. ఇక మోక్ష‌జ్ఞ మిస్సైనా ఘ‌ట్ట‌మ‌నేని వార‌సుడితో రాషా టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయింద‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: