రవితేజ హీరోగా నటిస్తున్న “మాస్ జాతర” పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మొదట ఈనెల 27న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. తర్వాత సెప్టెంబర్ 12న వస్తుందనే వార్తలు వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఆ తేదీకి కూడా రిలీజ్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. సినిమా మొత్తాన్ని చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలనే నిర్ణయానికి టీమ్ వచ్చింది. ముఖ్యంగా రవితేజ, శ్రీలీలతో పాటు మరికొందరు కీలక నటీనటుల డేట్స్ మళ్లీ కావాల్సి వచ్చింది. వాళ్లందరి డేట్స్ సెట్ చేసుకుని రీషూట్లు పూర్తి చేయాల్సి ఉండటంతో, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించడానికి సమయం పట్టే అవకాశం ఉంది.


ఇక ఈ పరిస్థితుల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కూడా కొంత కంగారులో ఉంది. ఇటీవల విడుదలైన “ కింగ్ డమ్ ” , “వార్ 2” సినిమాల వల్ల వారికి భారీ నష్టాలు వాటిల్లాయి. దీంతో ఈసారి తప్పకుండా సక్సెస్ అందుకోవాలని నిర్మాత నాగవంశీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. “వార్ 2” హిట్టయి ఉంటే, అదే ఊపులో “మాస్ జాతర” సినిమాను విడుదల చేసేవారేమో. కానీ ఆ సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారు. వాస్తవానికి రిలీజ్ ఆలస్యమవడం పెద్ద సమస్య కాదు. ప్రేక్షకులు మంచి సినిమా వస్తే ఎప్పుడైనా స్వాగతిస్తారు. కానీ ఒకసారి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ట్రోలింగ్, బాక్సాఫీస్ వద్ద దెబ్బ తిన్నట్టే.


ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న నాగవంశీ, జట్టుతో కలిసి సినిమా క్వాలిటీపై పూర్తి ఫోకస్ పెట్టారు. అందువల్ల ఆలస్యమయినా, “మాస్ జాతర” ను పాజిటివ్ టాక్‌తో, భారీ విజయాన్ని అందించేలా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మ‌రి ఈ రిపేర్లు మాస్ జాత‌ర సినిమాను ఎంత వ‌ర‌కు హిట్ చేస్తాయో ? చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: