గతంలో సినిమాలలో నటించి ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అయితే ఈ మధ్య మళ్లీ కూడా కొంతమంది రీ ఎంట్రీ ఇస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్ తో కూడా బాగానే ఆకట్టుకుంటున్నారు.అలా ఒకప్పుడు తెలుగు, హిందీ ,కన్నడ ,మలయాళం వంటి భాషలలో బాగా పేరు సంపాదించిన తులిప్ జోష్ కూడా ఒకరు. ఈమె చివరిసారిగా 2014లో ఒక చిత్రంలో మాత్రమే కనిపించింది .ఆ తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు. ఇప్పుడు బిజినెస్ లో దూసుకుపోతోంది. ఏకంగా పలు రకాల వ్యాపారాలను నిర్వహిస్తూ బిజీబిజీగా మారిపోయింది.



ఒక కన్సల్టింగ్ కంపెనీని నడపడమే కాకుండా ఇమే ఆస్ట్రాలజర్ గా కూడా పేరు సంపాదించింది. అలాగే జ్యోతిష్యం ,లైఫ్ స్టైల్స్ కన్సల్టేషన్ వంటి వాటిలో కూడా బాగా పేరు సంపాదించింది. 2002 లో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన "మేరే యార్ కి షాది హై" చిత్రంలో మొదటిసారిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తులిప్ జోష్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో దీని తర్వాత మాతృభూమి తదితర చిత్రాలను నటించింది. అయినా కూడా స్టార్ హీరోయిన్గా హోదా అందుకోలేకపోయింది.


రాజశేఖర్ నటించిన విలన్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ నటించిన కొత్త కొత్తగా అనే చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో నటించిన పెద్దగా ఈ సినిమాలేవి కూడా ఈమెకు ఉపయోగపడలేదు. 2014లో సల్మాన్ ఖాన్ నటించిన జయహో అనే సినిమాలో  చివరిసారిగా కనిపించింది తులిప్ జోష్.. ఆర్మీ ఆఫీసరైన జోషి వినోద్ నాయర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నది.. 1989 నుంచి 96 వరకు పంజాబ్ రెజిమెంట్లో విధుల నిర్వహించారు. అలా సినీ ఇండస్ట్రీకి దూరమైన తులిప్ జోష్ బిజినెస్ వుమెన్ గా మారింది. తన భర్తతో కలిసి ఒక కన్సల్టింగ్ కంపెనీల నడుపుతోందట. అలాగే పలు రకాల బిజినెస్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: