
అదే సమయంలో.. అదే రోజున విడుదలైన "కూలీ" సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో మంచి వసూళ్లు సాధించి, కలెక్షన్స్ పరంగా విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే "కూలీ" సినిమాకి కూడా మిక్స్‌డ్ రివ్యూలే రావడం విశేషం. ముఖ్యంగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసిన నేరేషన్, డైరెక్షన్‌కి నెగెటివ్ మార్కులు పడేలా చేసింది. ఇక లోకేష్ కనగరాజ్ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడని.. అలాగే రామ్ చరణ్‌తో కూడా ఒక భారీ ప్రాజెక్ట్‌కి మాట ఇచ్చాడని ఇండస్ట్రీ టాక్ బలంగా వినిపించింది. అయితే కూలి సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన నెగిటివ్ కామెంట్స్ కారణంగా, అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ .. ఇద్దరూ కూడా ఆ ప్రాజెక్టును వదిలేశారన్న రూమర్స్ ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాల్సిన ఆ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను లోకేష్ కనకరాజ్ ఇప్పుడు కోలీవుడ్‌కి చెందిన ఒక స్టార్ హీరోకి ఆఫర్ చేసినట్లు సమాచారం. తనపై వస్తున్న విమర్శలన్నిటినీ పాజిటివిటీగా మార్చుకోవడానికి, తన డైరెక్షన్‌కి మళ్లీ క్రేజ్ తెచ్చుకోవడానికి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ముఖ్యంగా ఖైదీ 2 సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తూ, అదే రీతిలో ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి లోకేష్ కనగరాజ్ మీదే ఉంది. ఆయన మళ్లీ తన డైరెక్షన్‌లో మ్యాజిక్ చూపిస్తాడా? లేక ఈసారి కూడా నెగిటివ్ కామెంట్స్ నుండి బయటపడలేకపోతాడా? అన్నది చూడాలి. ఏదేమైనా, జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు అన్న వార్తలు టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి.