టాలీవుడ్‌లో ఈ ఏడాది అత్యంత క్రేజీగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్  OG అనే చెప్పాలి. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ఇప్పటికే ప్రతి అప్‌డేట్‌తో హైప్‌ రెట్టింపు చేస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాపై ఫస్ట్ హాఫ్ టాక్ బయటకు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం OG సినిమా ఫస్ట్ హాఫ్ పూర్తి అయ్యి, ఆ కంటెంట్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ (RR) కూడా లాక్ చేశారట. యూనిట్ సభ్యులు చూసి చాలా సంతోషంగా ఉన్నారని.. ఫ‌స్టాఫ్‌ అద్భుతంగా వచ్చిందని టాక్ ? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా యాక్షన్, స్టైల్, ఎమోషన్స్ అన్నీ కలగలిపి ఫుల్ మీల్‌లా ఈ ఫస్ట్ హాఫ్ ఉంటుందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది.


ఇక  సెకండ్ హా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. దర్శకుడు సుజీత్ దాన్ని కూడా అదే స్థాయిలో బలంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, మొదటి పాటతోనే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్‌పై వస్తున్న పాజిటివ్ టాక్ ఆ అంచనాలను మరింత పెంచేస్తోంది. ఇక అభిమానుల కోసం మరో ప్రత్యేక సర్‌ప్రైజ్‌ కూడా టీమ్ రెడీ చేసింది.  ఇటీవలే నిర్మాతలు వినాయక చవితి సందర్భంగా రెండో సింగిల్‌ను రిలీజ్ చేస్తామని ప్ర‌కటించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, కొత్త పాటతో ఈ వేడి మరింతగా పెరిగే అవకాశం ఉంది.


OG పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కొత్త లెవెల్‌లో యాక్షన్ డ్రామా అనిపించేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోందని టాక్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, అభిమానులకు ఫుల్ ప్యాకేజీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందని వినిపించడం వల్ల సినిమాపై ఉన్న హైప్ మరింతగా పెరిగింది. ఏదేమైనా OG సినిమాతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌ర్ ర్యాంపేజ్ ఖాయ‌మ‌న్న ధీమాతో అభిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: