టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రయోగత్మక సినిమాలలో నటించడానికి ఎల్లప్పుడూ  ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నాయక్, గేమ్ చేంజర్  సినిమాలలో డ్యూయల్ రోల్ లో నటించగా ఈ సినిమాలలో నాయక్ హిట్ గా నిలిస్తే గేమ్ ఛేంజర్  సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.  ఒకింత భారీ అంచనాలు గేమ్ ఛేంజర్  సినిమాకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు.

అయితే గేమ్ ఛేంజర్  కు జరిగిందే పెద్ది మూవీ విషయంలో జరుగుతోందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.  పెద్ది సినిమాలో సైతం రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నారు. పెద్ది సినిమా బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే. సతీష్ కిలారు ఈ సినిమాకు నిర్మాత కాగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కు కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం ఉంది.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో  తెరకెక్కిన సినిమాల్లో  ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో పెద్ది సినిమా విషయంలో సైతం ఇదే మ్యాజిక్ జరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద నెక్స్ట్ లెవెల్ రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి. చరణ్  పుట్టినరోజు కానుకగా 2026 మార్చి నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

రామ్ చరణ్ పుట్టినరోజు అంటే అభిమానులకు  పండగ రోజు అనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తర్వాత సినిమా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకుంటున్న  ఈ మెగా హీరో పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ అన్నదానికి అవధులు  ఉండవు.



వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: