
తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన `రగడ` సినిమాను రీరిలీజ్ చేశారు. ఆగస్టు 29న నాగ్ బర్త్‌డేను పురస్కరించుకుని 4కె లో మూవీని రీ-రిలీజ్ చేశారు. అనుష్క, ప్రియమణి ఇందులో హీరోయిన్లు కాగా.. వీరు పోట్ల డైరెక్టర్. 2010లో రిలీజ్ అయిన రగడ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. అయితే ఈ రొటీన్ రివేంజ్ డ్రామాకు రీరిలీజ్ లోనూ అదే ఫలితం రిపీట్ అయింది. బుకింగ్స్ ఓపెన్ అయినప్పుడు ఏమంత గొప్ప స్పందన రాలేదు. విడుదల రోజు శుక్రవారం మొదటి ఆటకు థియేటర్లలో నాగ్ ఫ్యాన్స్ కొంత హంగామా చేసిన కూడా ఆ తర్వాత షోస్ అన్నీ చప్పబడిపోయాయి.
మొన్నామధ్య చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆయన నటించిన `స్టాలిన్` మూవీని రీరిలీజ్ చేయగా సేమ్ టు సేమ్ ఇదే రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసినంత రీతిలో రీరిలీజ్ వర్కౌట్ కాలేదు. జనాలు లేక చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ చేశారు. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్లకు ఈ ఫలితాలు కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. ఫ్యాన్స్, ఆడియెన్స్‌లో క్రేజ్ తగ్గిపోయిందా? అనే డౌట్స్ వస్తాయి. అయితే రీరిలీజ్ ఫలితం వల్ల స్టార్ ఇమేజ్ దెబ్బతినదు. కానీ ఇలా వరుసగా సినిమాలు ఆడకపోతే మాత్రం పరువు పోయిందనే టాక్ రావడం సహజం. స్టాలిన్, రగడ రీరిలీజ్ తర్వాత చిరు, నాగ్ విషయంలో అదే జరుగుతుంది.