తాజాగా తెలుగు పరిశ్రమలో సినీ కార్మికులకు వేతనాలను పెంచారు. వేతనాలను పెంచినట్లు తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. ఈ నెల అనగా ఆగస్టు 22 న కార్మిక శాఖ సమక్షంలో 13 కార్మిక సంఘాలు మరియు నిర్మాతల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 22.5% వరకు వేతనాలు పెంచుతున్నట్లు నూతన వేతన కార్డును నిర్ణయిస్తున్నట్లు ఫిలిం ఛాంబర్ తాజాగా ప్రకటించింది. ఈ సంవత్సరం ఆగస్టు 22 వ తేదీ నుండి వచ్చే సంవత్సరం ఆగస్టు 22 వ తేదీ వరకు 15% మేరా సినీ కార్మికులకు వేతనాలను పెంపును అమలు చేస్తున్నట్లు నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశాలను జారీ చేసింది.

వేతనాలను సంఘాల వారిగా సవరిస్తున్నట్లు కూడా నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ తాజాగా లేఖలను పంపినట్లు తెలుస్తోంది. జూనియర్ ఆర్టిస్టులను ఏ , బి , సి అనే మూడు విభాగాలుగా విభజించారు. అందులో ఏ కేటగిరీలో వారికి  1420 గాను రూపాయలు ,  బి కేటగిరీలో వారికి 1175 రూపాయలు గాను  ,  సి కేటగిరీలో variki 930 రూపాయలు ఇవ్వాలి అని ఫిలిం ఛాంబర్ నిర్వహించింది. ఇక ఒక వేళ ఉదయం కనుక అల్పాహారాన్ని సమకూర్చినట్లైతే వారికి 70 రూపాయలు ఇవ్వాలి అని , మధ్యాహ్న భోజనాన్ని కనుక సమకూర్చినట్లైతే వారికి 100 రూపాయలు అదనంగా ఇవ్వాలి అని నిర్ణయించారు.

ఇక ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కాల్ షిట్ కి  1470 రూపాయలు గాను ,  ఆఫ్ కాల్ షిట్ కి 735 రూపాయలు చెల్లించే విధంగా ప్రకటనలు జారీ చేశారు. కాల్ షీట్ సమయం నాలుగు గంటలు గంటలు దాటిన తర్వాత పూర్తి వేతనం చెల్లిస్తారు అని తెలియజేశారు. జీతాలు , పని నిబంధనలకు సంబంధించి ఇతర సమస్యలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కమిటీకి తెలియజేయాలి అని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి అయినటువంటి దామోదర ప్రసాద్ తాజాగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: