
అయితే ఈ రెండు కఠిన దెబ్బల తర్వాత కూడా నాగవంశీ వెనుకడుగు వేయలేదు. తాజాగా మలయాళంలో మంచి బజ్ తెచ్చుకున్న "కొత్త లోక – చంద్ర పార్ట్ 1" అనే సినిమాను తెలుగు డబ్బింగ్‌లో రిలీజ్ చేశాడు. మొదట్లో ఈ సినిమాపై టాలీవుడ్‌లో పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. కానీ అద్భుతమైన మౌత్‌టాక్ సోషల్ మీడియాలో పాకిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రిలీజ్ డే రోజునే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏపీ, తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ మూడు షోలు రద్దు కావాల్సి వచ్చింది. ఆ గ్యాప్‌లో సినిమా కంటెంట్ బాగుందనే టాక్ రావడంతో ఫాలో అవుతున్న వాళ్లు వెంటనే బుకింగ్స్ ప్రారంభించారు. బుక్ మై షోలో గంటకు 2 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం చిన్న విషయం కాదు. మొదటి రోజు ముగిసేసరికి మలయాళం వెర్షన్ 18 వేల టికెట్లకు పైగా సేల్ అవ్వడం ఆశ్చర్యం కలిగించింది.
తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కి కూడా అదే రీతిలో డిమాండ్ పెరిగింది. సినిమా కథలోని సూపర్ వుమెన్ కాన్సెప్ట్‌కి డ్రాకులా హారర్ టచ్ ఇవ్వడం దర్శకుడు డామినిక్ అరుణ్ చేసిన ప్రయోగం. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో ఎలాంటి లాగింగ్ లేకుండా కథను నడిపించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఈ సినిమాను సూపర్ హిట్ అనాలో, బ్లాక్‌బస్టర్ అనాలో చెప్పలేం, కానీ ప్రస్తుతానికి టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇక విచిత్రమేమిటంటే… టాలీవుడ్‌లో నేరుగా వచ్చిన "సుందరకాండ, త్రిబాణధారి బార్బరిక్, అర్జున్ చక్రవర్తి" లాంటి సినిమాలు ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించడానికి నానా తిప్పలు పడుతుంటే, ఒక డబ్బింగ్ సినిమా ఇంత సులభంగా డామినేషన్ చూపించడం ఆశ్చర్యకరం. నాగవంశీకి గత రెండు ఫెయిల్యూర్స్ ఎంత చేదుగా ఉన్నా, ఈ సక్సెస్ టాక్ మాత్రం అతడికి ఊరట ఇచ్చేలా కనిపిస్తోంది. ఫైనల్ రన్ పూర్తయి బాక్సాఫీస్ స్టేటస్ క్లియర్ అయ్యేవరకు ఏం చెప్పలేం కానీ… ప్రస్తుతం మాత్రం "కొత్త లోక – చంద్ర పార్ట్ 1" బాక్సాఫీస్ వద్ద మంచి డామినేషన్‌లో ఉందని చెప్పాల్సిందే .