టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లుగా చాలా కాలం పాటు కెరీర్ను కొనసాగించిన వారిలో శ్రీను వైట్ల ఒకరు. ఈయన కమర్షియల్ సినిమాలలో అద్భుతమైన కామెడీని జోడించడంలో స్పెషలిస్ట్. ఆ ఫార్ములా తోనే ఎన్నో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అద్భుతమైన విజయాలను ఎన్నింటినో అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ స్థాయికి చేరుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన దర్శకత్వంలో రూపొందిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర వరుస పెట్టి ఫెయిల్యూర్ అయ్యాయి. కొంత కాలం క్రితం ఈయన గోపీచంద్ హీరో గా కావ్య దాపర్ హీరోయిన్గా విశ్వం అనే సినిమాను రూపొందించాడు. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది.

ఇకపోతే శ్రీను వైట్ల ప్రస్తుతం తన తదుపరి సినిమాకు ఓ కథను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శ్రీను వైట్ల ప్రస్తుతం కొంత మంది యువ కథ రచయితలతో కలిసి ఒక కథను తయారు చేస్తున్నట్టు , ఆల్మోస్ట్ ఈ కథ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక శ్రీను వైట్ల టెక్స్ట్ మూవీ ని మైత్రి సంస్థ వారు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఇక శ్రీను వైట్ల ప్రస్తుతం తయారు చేస్తున్న కథతో రామ్ పోతినేని , నవీన్ పోలిశెట్టి , తేజ సజ్జ లలో ఒకరితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల ఆఖరుగా మహేష్ బాబు హీరో గా సమంత హీరోయిన్గా రూపొందిన దూకుడు మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

మూవీ తో ఈయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు ఏవి కూడా దూకుడు స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేదు. దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు తో శ్రీను వైట్ల ఆగడు అనే సినిమాను రూపొందించాడు  ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫెయిల్యూర్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: