పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఓజి. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ నటించగా, డివిడి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో వేగవంతమైన చిత్ర బృందం.. ఈ రోజున పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు.


గ్లింప్స్ విషయానికి వస్తే.."విలన్ గా నటిస్తున్న ఇమ్రాన్ హస్మి సిగరెట్ తాగుతూ.. డిఆర్ ఓజి  నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురుచూస్తున్నా నీ ఓమి" హ్యాపీ బర్తడే ఓజి అంటూ  ఇమ్రాన్ హాస్మి చెప్పే డైలాగ్ హైలెట్ గా ఉన్నది. ఇమ్రాన్ హస్మి  సిక్స్ ప్యాక్ బాడీ తో చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. చాలా క్రూరమైన విలన్ గా కూడా చూపించారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా గ్లింప్స్ లో హైలెట్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా కత్తి పట్టుకొని నడుచుకుంటూ వచ్చే సన్నివేశం అభిమానులకు మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది. అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకున్నారో ఓజి చిత్రంలో అలాగే కనిపిస్తున్నట్లు ఉంది.


ఓజి చిత్రంలో  విలన్ చెప్పిన డైలాగులు కూడా చాలా గంభీరంగా కనిపిస్తున్నాయి. ఇమ్రాన్ హస్మి పవన్ కళ్యాణ్ నే డామినేట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇందులో శ్రియ రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.ఈ ఏడాది విడుదలైన హరిహర వీరమల్లు సినిమాతో అభిమానులను నిరాశపరిచేలా చేశారు పవన్ కళ్యాణ్. అందుకే ఓజీ చిత్రం పైన ప్రత్యేకించి మరి శ్రద్ధ పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ అభిమానులకు ఆకట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇక ట్రైలర్ తో అయితే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగినట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: