పక్క ఇండస్ట్రీ హీరో లలో కొంత మంది తెలుగు దర్శకులతో పని చేయడానికి అత్యంత ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. అలా మన దర్శకులతో సినిమా చేయడానికి అత్యంత ఇంట్రెస్ట్ ను చూపిస్తున్న పక్క ఇండస్ట్రీ హీరోలలో ధనుష్ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ధనుష్ మన తెలుగు దర్శకుడు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన కుబేర అనే సినిమాలో హీరో గా నటించాడు.

భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటివరకు ఇద్దరు తెలుగు దర్శకులతో ధనుష్ రెండు సినిమాలు  చేస్తే ఆ రెండు సినిమాలతో కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే మరో తెలుగు దర్శకుడితో ధనుష్ సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి ... నాది నీది ఒకే కథ , విరాట పర్వం సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వేణు ఉడుగుల దర్శకత్వంలో ధనుష్ మరో తెలుగు సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ధనుష్ ఇప్పటివరకు తెలుగు లో చేసిన రెండు సినిమాలు కూడా కాస్త కమర్షియల్ ఫార్మేట్ కి దగ్గరగా ఉంటాయి.  వేణు అడుగుల ఇప్పటివరకు దర్శకత్వం వహించిన రెండు సినిమాలు కూడా కమర్షియల్ ఫార్మేట్ సినిమాలు కావు. దానితో ధనుష్ ఈ సారి తెలుగు లో కమర్షియల్ సినిమా కాకుండా వేరే జోనర్ సినిమా చేస్తాడా అని అభిప్రాయాలను కొంత మంది జనాలు వినిపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మాత్రం ధనుష్ అనేక సినిమాలలో నటిస్తూ అత్యంత బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: