కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను అందుకున్నాడు. శివ కార్తికేయన్ నటించిన చాలా సినిమాలు తెలుగు లో కూడా డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. కొంత కాలం క్రితం శివ కార్తికేయన్ "అమరన్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.

మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. అమరన్ లాంటి భారీ సక్సెస్ తర్వాత శివ కార్తికేయన్ , ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో మదరాసి అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ప్రస్తుతం పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. ఇకపోతే శివ కార్తికేయన్ తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడితో మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... శివ కార్తికేయన్ కొన్ని సంవత్సరాల క్రితం కాలేజ్ డాన్ అనే సినిమాలో హీరో.గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. మరోసారి శివ కార్తికేయన్ , సిబి చక్రవర్తి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. సిబి చక్రవర్తి , నాని హీరో గా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నాని , సిబి చక్రవర్తి కాంబో లో మూవీ లేనట్లే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sk