
ఇప్పుడు తాజాగా నయనతార ఖాతాలో మరో తలనొప్పి చేరింది. ప్రతిసారి ఈ డాక్యుమెంటరీలో ఏదో ఒక చిన్న తప్పు కనిపించడం దీనిపైన నయనతారను కోర్టుకు లాగడం వంటివి చాలా కామన్ గా మారిపోయింది. చంద్రముఖి నిర్మాతలు ఈమెకు నోటీసులు తాజాగా జారీ చేశారు.. 2005లో విడుదలైన చంద్రముఖి సినిమాతోనే నయనతార స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది. అందులో ఉండే కొన్ని విజువల్స్ తన డాక్యుమెంటరీలో ఉపయోగించారు. వారి అనుమతి లేకుండా తమ సినిమా క్లిప్పులను ఉపయోగించడంతో వారు హైకోర్టుని ఆశ్రయించారు.
ఈ విషయం పైన నెట్ ఫ్లిక్స్ కు హైకోర్టు నోటీసులు జారీ చేయగా అక్టోబర్ 6వ తేదీలోపు సమాధానం చెప్పాలని జారీ చేశారు. గతంలో హీరో ధనుష్ కూడా డాక్యుమెంటరీ పైనే తన అనుమతి లేకుండా నయనతార నటించిన నేను రౌడీనే క్లిప్ ఉపయోగించినందుకు రూ.10 కోట్ల రూపాయలు నష్టపరిహారం డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి ధనుష్ ప్రొడ్యూసర్. నయనతార ఈ డాక్యుమెంటరీ కి సంతకం చేయకుంటే ఈ బాధలన్నీ తప్పేవి. ఈ డాక్యుమెంటరీ వల్ల నయనతార జీవితాన్ని ముప్పు తిప్పలు పెట్టాలా చేసుకుంటోంది. మరి వీటన్నిటిని నయనతార ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.