
ఇపుడు ఆల్రెడీ టాలీవుడ్ దగ్గర అదరగొట్టిన లేటెస్ట్ సినిమాలలో యంగ్ , టాలెంటెడ్ హీరో తేజ సజ్జా నటించిన క్రేజీ ప్రాజెక్ట్ మిరాయ్ ఒకటి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా దుమ్ము లేపుతోంది. కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రు. 57 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఔరా అనిపించేలా దూసుకు పోతోంది. మిరాయ్ యూఎస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు అందుకుంటుంది. యూఎస్ మార్కెట్ లో మిరాయ్ ఇప్పటి వరకు ( ఆదివారం ) 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని క్రేజీ ఫీట్ ని సెట్ చేసింది. అయితే మరో పదిరోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అవైటెడ్ సినిమా ఓజి కూడా ఇదే క్లబ్ జాయిన్ అయ్యింది.
ట్విస్ట్ ఏంటంటే మిరాయ్ ఇప్పటికే రిలీజ్ అయ్యింది.. కానీ పవన్ సినిమా రిలీజ్ కు మరో పది రోజుల టైం ఉంది.
ఓజి ఇంకా 10 రోజులు గ్యాప్ ఉండగానే 1.5 మిలియన్ డాలర్ల ఫీట్ అందుకోవడం విశేషం. కాగా తేజ సజ్జ కెరీర్ లో హనుమాన్ తర్వాత మిరాయ్ ఈ భారీ మైల్ స్టోన్ అందుకోవడం విశేషం. మొత్తానికి ఒకే రోజు ఈ సినిమాలు అరుదైన ఫీట్ సొంతం చేసుకుని తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు