
మిరాయ్ కార్తిక్ ఘట్టమనేని ఒక సూపర్‌లేటివ్ ఎస్ఎఫ్ఎక్స్ వండర్‌నే తయారు చేశాడన్న ప్రశంసలు వస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు కథ, కథనాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. హీరో తేజ సజ్జా చూడటానికి బాగున్నాడు. అడ్వంచర్స్, స్టంట్స్ చేయగల కథానాయకుడిలా నప్పాడు. మంచు మనోజ్ విలన్ గా చాలా బాగా నప్పాడు, విలన్ అంటే వీడేరా అనిపించేలా మనోజ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఉన్నాయి. ఇక నటీనటులు అందరూ బాగా చేసారు. లేడి విలన్ తన్జా కెల్లర్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. దర్శకుడు కథ బానే అల్లుకొచ్చారు. ఫస్టాఫ్ చకచక నడుస్తూ బావుంది. సెకండాఫ్ చిన్న చిన్న కంప్లైంట్లు ఉన్నా పెద్దగా తప్పు పట్టలేం. రెండు వారాల్లో హీరో అంతంత ప్రయాణాలు చేసేసి కావలసినవి సాధించేయటం అసంబద్ధంగా ఉంది. ఇక సినిమా మొత్తం మీద వెర్రిమొర్రి పాటలు డాన్సులు రోమాన్సులు లేవు. హాస్యరసం బాగానే పండించారు.
అగస్త్య మహర్షికి స్వెట్టర్ ఎవరు అల్లిచ్చారో ? అసలు ఆ పాత్రకు ఉండాల్సిన గాంభీర్యం అగుపడలేదు. జయరాం ముఖకవళికల వల్ల ఏదో కామెడి కేరెక్టర్ లా ఉండటం వల్ల ముఖ్యమైన ఘట్టాలు కొంచెం పలుచబడ్డాయన్న కంప్లైంట్లు ఉన్నాయి. శ్రియ శరణ్ పాత్ర కల్కి లో శోభన పాత్రలా ఉన్నా, శ్రియ చేసిన పాత్ర తో పాటు ఆమె నటన ఎక్కువ బాగున్నాయి. క్లైమాక్స్ లో శ్రీరాముడు కనిపించే సన్నివేశాల విజువల్స్ బాగున్నా కథపరంగా ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయలేదు. గౌర హరి సంగీతం 100/100 మార్కులు పడతాయి. సినిమా సగం బలం ఈ నేపథ్య సంగీతమే. ఇక గ్రాఫిక్స్‌కు అయితే 200 / 100 ... ఓవరాల్‌గా మిరాయ్ సినిమాకు 8 / 10 మార్కులు వేసేందుకు ఏమాత్రం సందేహాలు అక్కర్లేదు.