
ఆ చిత్రంలో ఇమే చేసింది సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ ఆ తర్వాత ఒరేయ్ రిక్షా, జయభేరి, అక్క బాగున్నావా, వినోదం, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు వంటి చిత్రాలలో కూడా నటించింది. 18 ఏళ్లకే మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవళి ఆ తర్వాత తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించింది. అయితే వివాహము అనంతరం ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉన్న రవళి పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమై ఎక్కువగా ఫ్యామిలీతోనే తన సమయాన్ని గడిపేస్తోంది. కానీ చాలా కాలం తర్వాత తిరిగి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చిన రవళి నీ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న ఫోటోల విషయానికి వస్తే రవళి గ్రీన్ కలర్ దుస్తులలో భారీగా బరువు పెరిగినట్టుగా కనిపిస్తోంది. మొదట ఇమే ను చూస్తే అలనాటి హీరోయిన్ రవళి నేనా అన్నట్టుగా మారిపోయింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా ఇమేను గుర్తుపట్టడం కష్టమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. వైసిపి మహిళా నేత, సినీనటి రోజాతో కలిసి ఇమే తిరుపతిలో కనిపించింది. రవళి చివరిగా 2011 లో మాయగాడు అనే చిత్రంలో కనిపించింది. 2007లో నీలీకృష్ణ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు.