షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్.. ఈ వెబ్ సిరీస్ కోసం భారీ తారగాణాన్ని ఇందులో తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో రణబీర్ కపూర్ క్యామియో రోల్ ఆకట్టుకుంటుంది.అయితే కామియో రోల్ ఏమోగానీ రణబీర్ కపూర్ చేసిన పని ప్రస్తుతం వివాదంలో ఇరుక్కుంది. అదేంటంటే ది బ్యాడ్స్ బాలీవుడ్ లో కొన్ని నిషేధిత సన్నివేశాలు ఉన్నాయి.అదేంటంటే ఈ-సిగరెట్.. ఈ-సిగరెట్ ని వినియోగించకూడదని 2019లో చట్టం వచ్చింది.అలాంటి ఈ-సిగరెట్ నిషేధిత చట్టం 2019 ఉల్లంఘించినందుకు గానూ ఈ వెబ్ సిరీస్ నిర్మించిన ప్రొడ్యూసర్ పై ఈ సీన్  చేసిన రణబీర్ కపూర్ పై నెట్ ఫ్లిక్స్ పై NHRC అనగా మానవ హక్కుల కమిషన్ మండిపడింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో వచ్చిన చాలా సన్నివేశాలపై ఎన్ హెచ్ ఆర్ సి ఫైర్ అయ్యింది.

 అంతేకాకుండా కేంద్ర సమాచార శాఖతో పాటు ముంబై పోలీసులకు ఆ వెబ్ సిరీస్ పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. నెట్ ఫ్లిక్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని తెలిపింది. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఉపయోగించిన ఈ- సిగరెట్ కి సంబంధించి డిస్క్లైమర్, హెచ్చరికలు  లేకుండానే ఈ సీన్ ని వెబ్ సిరీస్ లో పెట్టేసారు. అలా ఎలా పెడతారు అని వినయ్ జోషి అనే వ్యక్తి మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. వినయ్ జోషి చేసిన ఫిర్యాదుని తీసుకున్న ఎన్ హెచ్ ఆర్ సి కేంద్ర సమాచార కమిషన్ కి నోటీసులు జారీ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే ఆ సన్నివేశాలను వెబ్ సిరీస్ నుండి పూర్తిగా తొలగించాలని వార్నింగ్ ఇచ్చింది. 

వెబ్ సిరీస్ లో,సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు ఉండటం వల్ల యంగ్ జనరేషన్ పై వీటి ప్రభావం ఉంటుందని,ప్రమోషన్ కోసం ఇలా చట్టాన్ని ఉల్లంఘించే పనులు చేస్తే ఉపేక్షించే లేదని కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ మానవ హక్కుల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. ఇక షారుక్ ఖాన్ కొడుకు డైరెక్షన్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో రన్బీర్ కపూర్ తో పాటు అమీర్ ఖాన్,షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు అతిధి పాత్రల్లో మెరిసారు. మరి మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన నోటీసులను వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ లెక్క చేస్తారా..లేక ఈ వివాదాన్ని ఇంకా పొడిగిస్తారా..ఈ సీన్స్ ని వెబ్ సిరీస్ నుండి తీసేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: