
ఇటీవల అనసూయ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో, ఫొటోలు మరీ మరీ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత వారం రోజులుగా ఆమె ఐస్లాండ్ టూర్‌లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ప్రకృతి సోయగాలను ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా అనసూయ ఐస్లాండ్ ట్రిప్ ఫొటోలు దర్శనమిస్తున్నాయి. కానీ ఈ ట్రిప్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారింది ఒక విషయం. అనసూయ పక్కన మరో తెలుగు హీరో కనిపించడం. ఆయన మరెవరో కాదు .. నటుడు నవదీప్. వీరిద్దరూ కలిసి సరదాగా గడుపుతున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ అక్కడ ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్లినట్టుగా సమాచారం వస్తున్నప్పటికీ, షూటింగ్ గ్యాప్‌లో కలసి ఎంజాయ్ చేస్తూ తీసుకున్న పిక్స్ మరింత వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియోల వల్ల అభిమానుల్లో వేర్వేరు రియాక్షన్లు వస్తున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ "ఫ్రెండ్స్‌గా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, దానిలో తప్పేమీ లేదు" అని పాజిటివ్‌గా స్పందిస్తుండగా, ఇంకొందరు మాత్రం వేరే అర్థాలు వెతుకుతున్నారు. ఏదేమైనా సోషల్ మీడియాలో వీరిద్దరి పేర్లు చర్చకు రావడం మాత్రం పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అనసూయ అయితే ఈ కామెంట్ల గురించి పెద్దగా పట్టించుకోకుండా, తన కెరీర్‌ను ఇంకా హై రేంజ్‌కి తీసుకెళ్లే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. ఎప్పుడూ కొత్త కొత్త ప్రాజెక్టులు, సవాళ్లను స్వీకరిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు నిలబెట్టుకోవాలని కృషి చేస్తోంది. అందుకే ఈరోజు ఆమె టాలీవుడ్‌లో కేవలం ఒక యాంకర్‌గానే కాకుండా, ఒక బలమైన నటిగా, స్ట్రాంగ్ ఉమెన్ ఐకాన్‌గా నిలబడగలిగింది.