తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో సుజిత్ ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతున్న ఈయన ఇప్పటివరకు కేవలం మూడు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. ఈయన రన్ రాజా రన్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఆ తర్వాత సాహో , తాజాగా ఓజి సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించాడు. సాహో మూవీ మరియు ఓజి విడుదలకు మధ్యలో చాలా గ్యాప్ ఉంది. మరి ఇలా ఇంతలా ఓ సినిమా తర్వాత మరో సినిమాకు గ్యాప్ రావడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా సుజిత్ చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా సుజిత్ మాట్లాడుతూ ... సాహో సినిమా తర్వాత విరామం తీసుకోవాలి అని అస్సలు అనుకోలేదు. ఆ మూవీ విడుదల అయిన వెంటనే రామ్ చరణ్ తో సినిమా చేయాలి అని అనుకున్నాను. అందులో భాగంగా యూకే బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేయాలి అని అనుకున్నాను. కానీ అదే సమయంలో కోవిడ్ మొదలైంది. షూటింగ్ చేసే అవకాశం అస్సలు లేదు. దానితో ఆ ప్రాజెక్టు ఆలస్యం అవుతూ వస్తుండటంతో లూసిఫర్ రీమేక్ కి సంబంధించి చిరంజీవి సార్ ని కలిసాను.

ఇక లూసిఫర్ మూవీ డైరెక్టర్ డైరెక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ , సినిమాటో గ్రాఫర్ సుజిత్ వాసుదేవ్ తో కూడా మాట్లాడాను. సాహో కథ , ప్రపంచం తనకు నచ్చింది అని పృథ్వీరాజ్ నాకు చెప్పాడు. నా ఒరిజినల్ ప్రాజెక్టు వాళ్లకి నచ్చి వాళ్ళు నాకు ఓ సినిమా చేసే అవకాశం ఇవ్వాలి అనుకున్నారు. అలాంటప్పుడు రీమిక్ సినిమా అవసరమా అని నాకు అనిపించింది. ఇలా అనేక కారణాల వల్ల సాహో మూవీ తర్వాత నెక్స్ట్ మూవీ రావడానికి చాలా సమయం పట్టింది అని సుజిత్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: