
వాస్తవంగా విజయ్ సభకు 10,000 మందికి మాత్రమే అనుమతి ఉండగా అక్కడికి 50,000 మంది వచ్చినట్లు సమాచారం. విజయ్ కూడా స్టార్ హీరో కావడం చేత భారీ ఎత్తున అక్కడికి అభిమానులు, జనాలు తరలివచ్చారు. అలాగే విజయ్ రావలసిన సమయం కంటే 6 గంటల పాటు ఆలస్యంగా వచ్చారు. అయితే అప్పటికే అభిమానులు, జనం సైతం ఆకలితో, దప్పికతో చాలా అలసటగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో అక్కడ జనాలు సృహతప్పి పడిపోయే పరిస్థితిలో ఉన్నారు. వాటర్ బాటిల్స్ కోసం కూడా అక్కడ పెద్ద ఎత్తున గందరగోళం చోటుచేసుకుంది.
సభలోకి వచ్చిన విజయ్ కూడా వాటర్ బాటిల్స్ జనంలోకి విసరడంతో అప్పటికే అభిమానులు, జనం చాలా అలసిపోయి ఉండడంతో బాటిల్స్ కోసం కూడా ఎగబడ్డారు. దీనివల్ల తోపులాట మొదలయ్యింది. అలాగే ఈ సభలో తొమ్మిదేళ్ల పాప మిస్ అవ్వడంతో విజయ్ కూడా స్పీచ్ మధ్యలో ఆ పాపని వెతికి ఇవ్వాలని పోలీసులకు విన్నవించుకున్నారు.అలా స్పృహ తప్పి పాప పడిపోయిందని మాటలతో పాపను వెతికే క్రమంలో తోపులాట జరిగిందని తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి. ఆ తర్వాత నుంచి ఈ తొక్కిసలాట జరిగిందని వినిపిస్తున్నాయి.ఈ ఘోర ప్రమాదం వెనుక తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా స్పందించి.. ఇంతమంది సభలో చనిపోవడం చాలా బాధాకరమని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ విషయం పైన తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.విజయ్ కూడా ఈ విషయం పైన ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.