
తాజాగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో నటించిన తులసి కుమార్ అనే చిత్రంలో నటించగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెద్ది సినిమా గురించి, రామ్ చరణ్, బుచ్చిబాబు గురించి మాట్లాడింది. జాన్వీ మాట్లాడుతూ పెద్ది సినిమాలో తన క్యారెక్టర్ బ్లాస్ట్ అయ్యే విధంగా ఉంటుందని అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ కలిగించే క్యారెక్టర్ గా మారిపోతుందని తెలిపింది. డైరెక్టర్ బుచ్చిబాబు గురించి మాట్లాడుతూ.. అంతకుముందు ఆయన తెరకెక్కించిన ఉప్పెన సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఆయన రూటేడ్ డైరెక్టర్ గా , ఒక విజన్ ఉన్న డైరెక్టర్ అంటూ తెలిపింది.
పెద్ది చిత్రంలో ఆయన రాసిన పాత్ర చాలా సింపుల్ హీరోయిన్ లాగా మాత్రమే ఉండదు చాలా వేరియేషన్స్ ఉంటాయని, సినిమా షూటింగ్ సెట్లో కూడా తనకి బాగా సపోర్ట్ చేస్తారని, ఆయన ఆ సెట్లో ఉండడం నా అదృష్టం .. రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఐ లవ్ రామ్ సార్ అంటు తెలిపింది జాన్వీ ,అంతేకాకుండా ఆయన ఒక జెంటిల్ మెన్, సూపర్ ఎనర్జీ, ఎంతో సీనియర్ అయినప్పటికీ ఒక పెద్ద స్టార్ హీరో అని కాకుండా ఎప్పుడూ కూడా షూటింగ్ కి ఒక స్టూడెంట్ల వచ్చి షూటింగ్ కోసం వెళ్లడానికి ఎదురు చూస్తూ ఉంటారని తెలిపింది. మొత్తానికి జాన్వి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి..