
ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరో కాదు రవిచంద్రన్. OG సినిమాకి పనిచేసింది ఈయనే. ఇండియాలో టాప్ సినిమాటోగ్రఫీ గా పేరుపొందిన ఈయన తెలుగు, తమిళ్, మలయాళం ,బాలీవుడ్ వంటి భాషలలోని సినిమాలకు పని చేశారు. తెలుగులో భరత్ అనే నేను, భీమ్లా నాయక్, ఓజీ వంటి చిత్రాలకు మాత్రమే పనిచేశారు. ఓజి సినిమాలో సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా అద్భుతంగా కనిపించాయి. పవన్ కళ్యాణ్ ను స్టైలిష్ గా చూపించడం వెనక కూడా ఈయన హస్తం ఉందని అందుకే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.రవిచంద్రన్ పని గురించి సినిమా చూసిన అభిమానులు కూడా ప్రశంసించారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవిచంద్రన్ మాట్లాడుతూ.. తన కెమెరా విజువల్స్ లో నటీనటుల ఆత్మవిశ్వాసంతో కనిపించాలనుకుంటాను అందుకే అందరికీ నచ్చే అవుట్ ఫుట్ తీసుకురావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటానని తెలిపారు. అలాగే ఓజి సినిమాలో ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ చేసినప్పుడు లైటింగ్ అంతగా నచ్చలేదు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారి సమయం దొరకడమే పెద్ద విషయం అయినా సరే లైటింగ్ లో తాను అసంతృప్తి పడడంతో పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం చెప్పాను.. ఆయన కూడా సరే అని చెప్పారు! అందుకోసం కొన్ని గంటలపాటు వెయిట్ చేయాలి అంటే ఏ మాత్రం విసుగు లేకుండా వెళ్లిపోయి మరి సెట్ చేశాక సినిమా షూటింగ్ కి వచ్చారని తెలిపారు.