కన్నడ హీరో రిషబ్ శెట్టి , స్వయంగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం కాంతార చాప్టర్ 1. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ ని రాబడినట్లు తెలిసింది. ఆదివారం రోజున ఈ సినిమా అత్యధికంగా కలెక్షన్ (సింగిల్ డే) రాబట్టిన చిత్రంగా నమోదైనట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. నాలుగు రోజులలోనే ఈ సినిమా లాంగ్ వీకెండ్ ని పూర్తి చేసుకుంది. దీంతో రూ. 335 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు అధికారికంగా చిత్ర బృందం పోస్టర్ ద్వారా తెలియజేసింది.


ఈ కలెక్షన్స్ తో కన్నడ సిని పరిశ్రమలోనే ఒక చరిత్ర సృష్టించారు రిషబ్ శెట్టి. కేజిఎఫ్ 2 సినిమా తర్వాత అత్యధికంగా మొదటి వారం కలెక్షన్స్ సాధించిన రెండవ అతిపెద్ద చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో బాక్సాఫీస్ వద్ద వారి కలెక్షన్స్ రాబట్టింది. ఇక విడుదలైన తెలుగు, హిందీ, తమిళ్ ,మలయాళం వంటి భాషలలో కూడా కలెక్షన్స్ తో సంచలనాలను సృష్టిస్తోంది కాంతార చాప్టర్ 1.


ఇందులో చూపించిన దైవత్వం యాక్షన్స్ సన్నివేశాలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఒకవేళ ఇదే తంతు ఇలాగే కొనసాగితే దీపావళి పండుగ వరకు కలెక్షన్స్ సునామి సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రిషబ్ శెట్టితో పాటుగా ప్రముఖ హీరోయిన్ రుక్మిణి వసంత్, నటుడు జయ రామ్, గుల్షన్ దేవయ్య తదితర నటీనటులు నటించారు. 30 దేశాలలో 7 భాషలలో 7 థియేటర్లలో విడుదలై  ఈ సినిమా అన్ని భాషలలో కూడా హౌస్ ఫుల్ షోలతో నడుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: