నటి త్రిష ఆస్ట్రేలియన్ బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు గత మూడు నాలుగు రోజుల నుండి ఓ వార్త తమిళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా అభిమానులందరికీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. తన పెళ్లి వార్తలు వినిపిస్తున్న వేళ హనీమూన్ డేట్ ఫిక్స్ చేయండి అంటూ త్రిష పెట్టిన పోస్ట్ సంచలనాలకు దారి తీసింది. మరి నిజంగానే ఆస్ట్రేలియన్ బిజినెస్ మాన్ తో త్రిష పెళ్లి పీటలెక్కబోతుందా.. అందుకే హనీమూన్ డేట్ ఫిక్స్ చేయండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. హీరోయిన్ త్రిష తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ మధ్యకాలంలో నా పర్సనల్ విషయాలను కూడా మీరే నిర్ణయిస్తున్నారు. అలాంటప్పుడు నా హనీమూన్ డేట్ ఎప్పుడో కూడా మీరే ఫిక్స్ చేయండి అంటూ ఫన్నీగా తన పెళ్లి వార్తలను ఉద్దేశించి త్రిష ఈ పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతుంది. 

ఎందుకంటే ఇప్పటికే చాలామందితో త్రిష పెళ్లి వార్తలు వైరల్ చేశారు. అలా రీసెంట్గా చండీగర్ కి చెందిన ఫ్యామిలీ ఆస్ట్రేలియాలో బిజినెస్ రంగంలో స్థిరపడి మళ్లీ ఇండియాలో తన బిజినెస్ ని విస్తరించడం కోసం ఇండియా వచ్చినప్పుడు త్రిషని చూసి ఆ బిజినెస్ మాన్ ప్రేమలో పడ్డాడని,ఇక ఈ బిజినెస్మెన్ ఫ్యామిలీతో పెళ్లి కోసం త్రిష పేరెంట్స్ కూడా మొగ్గు చూపడంతో త్రిషని ఆస్ట్రేలియా బిజినెస్ మాన్ తో పెళ్లికి ఒప్పించి ఇరుకుటుంబ సభ్యులు ఎంగేజ్మెంట్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారంటూ రూమర్ లు వినిపించాయి. అలా త్రిష తన పేరెంట్స్ తీసుకొచ్చిన పెళ్లి సంబంధాన్ని కాదనలేక పేరెంట్స్ కోరిక మేరకు ఆస్ట్రేలియా బిజినెస్ మాన్ తో ఏడడుగులు వేయడానికి ఒప్పుకున్నట్టు ఓ రూమర్ తమిళ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
అయితే ఈ రూమర్ గత మూడు నాలుగు రోజుల నుండి ఎక్కువగా వైరల్ అవడంతో ఇది కాస్త త్రిష దగ్గరి వరకు చేరడంతో దీనిపై ఫన్నీగా స్పందిస్తూ నా పెళ్లి నిర్ణయించినప్పుడు నా హనీమూన్ డేట్ కూడా నిర్ణయించండి అన్నట్లుగా పెళ్లి వార్తలు రూమర్స్ అని క్లారిటీ ఇచ్చింది. ఇక ఇప్పటికే పలుమార్లు త్రిష పెళ్లి వార్తలపై రూమర్లు వినిపించాయి. కానీ ఇప్పటివరకు అయితే ఆమె పెళ్లి పీటలు ఎక్కడం లేదు. గతంలో ఓ బిజినెస్ మాన్ తో పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రస్తుతం త్రిష విజయ్ తో ప్రేమలో ఉంది అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె పెళ్లి వార్తలకి హీరోయిన్ రియాక్షన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: