
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసిన ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే గతంలో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది అంటూ చిత్ర బృందం ప్రకటించిన తాజాగా మైత్రి నిర్మాత రవిశంకర్ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పార్ట్ సంబంధించి షూటింగ్ పూర్తి అయ్యిందని అయితే ఇంకా 25 రోజులపాటు సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉందంటూ తెలియజేశారు.
ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక కొత్త షెడ్యూల్ తో రాబోతున్నామని, సినిమా రిలీజ్ డేట్ విషయంపై ఇంకా ఎలాంటి ఫైనల్ డేట్ ని ఫిక్స్ చేయలేదంటూ తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తూ ఉంటే సినిమా షూటింగ్ బ్యాలెన్స్ కూడా చాలానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయితే వచ్చే ఏడాది చివరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం తమిళ సినిమా తేరి సినిమాకి రీమిక్ అన్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి. కానీ డైరెక్టర్ మాత్రం ఈ సినిమా స్టోరీని మార్చేసామని తెలిపారు. ఇందులో హీరోయిన్స్ గా శ్రీలీల, రాశిఖన్నా నటిస్తున్నారు.