పలు సినిమాలు నిర్మిస్తూ గీతా ఆర్ట్స్ లో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న బన్నీ వాసు అంటే తెలియని వారు ఉండరు. ఈయన పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ చిన్న దర్శకులకి హీరోలకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి బన్నీ వాసు నిర్మించిన తాజా మూవీ మిత్రమండలి.. ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఘనంగా నిర్వహించారు.ఇక ఈ  ఈవెంట్లో బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.ఏం పీక్కుంటారో పీక్కోండి భయపడేదే లేదు అన్నట్లు బన్నీ వాసు మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారాయి.మరి బన్నీ వాసు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారు అనేది చూస్తే..ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రోలర్స్ బెడద ఎక్కువైపోయింది.ఏ పని చేసినా దానిని ట్రోల్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఈ ట్రోలింగ్ ఎక్కువగా వినిపిస్తుంది. అయితే మిత్రమండలి సినిమా ట్రైలర్ కింద చాలామంది ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తూ కామెంట్స్ పెట్టారట. 

ఇక దీన్ని ఉద్దేశించి బన్నీ వాసు మాట్లాడుతూ.. సినిమా ట్రైలర్ కింద చాలామంది నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.కానీ సినిమా చూసి ఎలా ఉందో ఆ తర్వాత  కామెంట్ పెట్టండి. అక్టోబర్ 16న దాదాపు నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. ఆ సినిమాలన్నీ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.అలాగే ట్రోలర్స్ ఏం చేసినా నా వెంట్రుక కూడా పీకలేరు.. నేను పడిపోవాలని కోరుకున్నా కూడా నాకేమీ కాదు. ఇండస్ట్రీలో అందరూ ఎదగాలి అనేదే నా కోరిక. కష్టపడి ఎదిగిన వారి సినిమాలను ఎవరో డబ్బులు పెట్టే ట్రోల్ చేయిస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు. నా సినిమా పోవాలని కొంతమంది డబ్బులు పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. కానీ వారికి ఇదే నా కౌంటర్. ఇలాంటి ట్రోల్స్ చేసే వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు.. వెంట్రుక తల మీద నుండి కాకుండా వేరే దగ్గర నుండి కూడా పీకి ఇవ్వగలను. కానీ కేవలం తల మీదనే ఎందుకు పీకి ఇస్తున్నానంటే అది నా సంస్కారం.

ఇక డబ్బులు తీసుకుని ట్రోల్ చేసేవారు మరిన్ని డబ్బులు తీసుకోండి. ఎందుకంటే మీకు ఆ సినిమాపై పాజిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ప్రిపేర్ అయ్యి నెగిటివ్ చేస్తున్నారు కాబట్టి మరిన్ని డబ్బులు తీసుకోండి. ఇక ట్రోల్స్ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ముందుకు వెళ్లలేం.అందుకే నేను ఈ ట్రోల్స్ ని పట్టించుకోను ఎప్పుడు పరిగెడుతూనే ఉంటా. ఇక ట్రోలింగ్ చేయించే వాళ్ళు డబ్బులు ఇప్పుడే మొత్తం ఖర్చు పెట్టకండి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యాక కూడా డబ్బులు ఇచ్చి మళ్ళీ ట్రోలింగ్ చేయించాలి కదా.. ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమాలో కథ ఉంటే చూస్తారు. లేకపోతే ఆ సినిమా ఆడదు. అంతే కానీ ఇలా డబ్బులు పెట్టి ట్రోలింగ్ చేసినంత మాత్రాన సినిమాకి పోయేది ఏమీ ఉండదు అంటూ ట్రోలర్స్ అందరికీ కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: