
ఇక దీని అనంతరం పవన్ కళ్యాణ్ ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి . రీసెంట్ నిర్మాత దిల్ రాజుకు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే దీనిపై దిల్ రాజు స్పందిస్తూ .. పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయాలని చూస్తున్నామని .. అయినా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే లేట్ అని తెలిపాడు . దీంతో దిల్ రాజు ఏ డైరెక్టర్ ను దించుతాడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పవన్ ఫ్యాన్స్ . కచ్చితంగా అనిల్ రావిపూడి తోనే సినిమా ఉండనుందనే ప్రచారం సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది .
దిల్ రాజు సంస్థలు అనిల్ రావిపూడి ఎప్పటినుంచో సినిమాలు చేస్తున్నాడు . ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తుండగానే పవన్తో సినిమా మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి . భగవంత్ కేసరి ఇలాంటి కథలతోనే అనిల్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది . అనిల్ హిట్ డైరెక్టర్ కావడంతో అతనితో సినిమా చేసేందుకు పవన్ కూడా ఎటువంటి అభ్యంతరాలు చెప్పే అవకాశాలు లేవని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు . అందువలనే ఈ కాంబినేషన్లో దిల్ రాజు సెట్ చేసినట్లు టాక్ నడుస్తుంది . మరి ఈ విషయంపై ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందో వేచి చూడాలి .