నువ్వులు అనేవి అన్ని ప్రాంతాలలో దొరుకుతూ ఉంటాయి. నువ్వులను పొడిగా లేదా చలివిడిగా చేసుకొని తింటూ ఉంటారు. మరి కొన్ని ప్రాంతాలలో బర్ఫీ గా చేసుకొని తింటూ ఉంటారు. కానీ కొంతమంది వీటిని తినడానికి మక్కువ చూపరు. అలాంటివారు ఈ నువ్వుల వల్ల లాభాలు తెలిస్తే మాత్రం తినక మానరు. నువ్వులలో పీచు పదార్థం అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందించేలా సహాయపడుతుంది. వీటికి తోడు పెగు పనితీరుకు కూడా సహాయపడుతుంది. అలాగే జీర్ణ సమస్యలు మలబద్ధక సమస్యలను కూడా తగ్గిస్తుంది.


నువ్వులలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుపదార్థాల వల్ల చెడు కొలెస్ట్రాలను తగ్గించేలా చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు దరి చేరనివ్వకుండా చేస్తాయి.

నువ్వులలో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్, మెగ్నీషియం వల్ల రక్తపోటును నియంత్రించడంలో చాలా సహాయపడతాయి. ఇవి గుండె పనితీరును  మెరుగుపరచడంలో సహాయపడతాయి.

నువ్వులలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను, ప్రోటీన్ ను అందిస్తాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతూల్యంగా ఉండేలా చేస్తాయి.

నువ్వులలో ఎక్కువగా విటమిన్ -E ఉండడం వల్ల చర్మాన్ని అందంగా కనపరచడానికి, అలాగే జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

నువ్వుల  గింజలలో ఫైటో ఈస్ట్రోజన్లు ఉండడం వల్ల మహిళలకు రుతుక్రమం ఆగిపోయిన లక్షణాలను కూడా తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే మహిళలకు హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ ను  తగ్గించేలా చేస్తుంది.

ఎవరైనా థైరాయిడ్ తో ఇబ్బంది పడుతున్న వారు నెలలు కనీసం రెండు మూడు సార్లు అయినా నువ్వుల చలివిడిని తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.

నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి.

నువ్వులలో ఉండేటువంటి ఐరన్, విటమిన్ B -6, రాగి వంటి పోషకాలు ఉంటాయి .ఇవి శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరిచేలా చేస్తాయి.

నువ్వులతో చేసిన వాటిని తినడం వల్ల ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.

ముఖ్య గమనిక..గర్భవతులు నువ్వులతో చేసిన వాటిని తినకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: