అందరూ ఊహించినట్టుగానే చివరికి అదే జరిగింది. ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో “రష్మిక మందన్నా  తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ ఎవరికీ దక్కుతుందా?” అన్న చర్చ పెద్ద ఎత్తున నడుస్తూనే ఉంది. చాలామంది అభిమానులు, సినీ విశ్లేషకులు “ఇండస్ట్రీలో వచ్చే తదుపరి నేషనల్ క్రష్ రుక్మిణి వసంత్ అవుతుంది” అంటూ ధీమాగా కామెంట్లు చేశారు. మొదట ఆమె ఈ విషయాలపై పెద్దగా స్పందించకపోయినా, తన ప్రతిభతో, అందంతో, స్క్రీన్‌పై చూపిన ఎమోషన్‌తో ఒక్కో అడుగుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ‘కాంతారా చాప్టర్ వన్’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయిన తర్వాత రుక్మిణి వసంత్  పేరు కర్ణాటక నుండి దేశవ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. ఆ సినిమా తర్వాత ఆమె ఇమేజ్ ఒక్కసారిగా నేషనల్ స్థాయికి ఎదిగిపోయింది. అందమైన రూపం, ఆకట్టుకునే నటన, సాఫ్ట్ స్పోకెన్ నేచర్ – ఇవన్నీ కలగలిపి రుక్మిణిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే చాలా మంది సినీప్రియులు ఆమెను “నెక్ట్స్ నేషనల్ క్రష్” అని పిలుస్తూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు చేస్తున్నారు.

ఇటీవల వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం రుక్మిణి వసంత్ ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత పెద్ద ఆఫర్‌ను పట్టేసిందట. అవును, ఈసారి ఆమె ఎదురుగా నటించబోయే హీరో చిన్నవాడు కాదు — అదే మన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ! వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ను ఎంపిక చేశారని సినీ వర్గాల్లో హాట్ టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే పనులు పూర్తయిన వెంటనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా అంతా ఉత్సాహంతో నిండిపోయింది. అభిమానులు “రష్మిక తర్వాత నేషనల్ క్రష్ నువ్వే రుక్మిణి!” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె లుక్, గ్లామర్, టాలెంట్ అన్నీ కలిపి నేషనల్ లెవెల్లో క్రేజ్ దక్కించుకునే స్థాయికి చేరుకుంది. ఇండస్ట్రీలో ఇప్పుడు రుక్మిణి వసంత్  పేరు హైలెట్ అవుతుంది. ఒక్క కర్ణాటకలో మాత్రమే కాదు, తెలుగు, తమిళ, హిందీ సినీ వర్గాల్లో కూడా ఆమె పేరు గట్టిగా వినిపిస్తోంది. ఫ్యాన్ బేస్ రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త ఆఫర్లు వరుసగా వస్తుండటంతో ఆమెను చాలామంది “నేషనల్ క్రష్” అని సంబోధిస్తున్నారు.

ఇక ఈ క్రేజీ కాంబినేషన్ — రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ప్రతిభావంతురాలు రుక్మిణి వసంత్, మరియు క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ — కలిసినప్పుడు ఏమి జరగబోతోందో అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరిగిపోతోంది. అభిమానులు మాత్రం ఒక్కటే అంటున్నారు —“ఇండియా కొత్త నేషనల్ క్రష్ వచ్చేసింది… ఆమె పేరు రుక్మిణి వసంత్!” అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: