
సిద్ధు ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సంచలనమే రేపాడు. అభిమానులు, నెటిజన్లు ఈ వ్యాఖ్యలను విభిన్న రీతుల్లో విశ్లేషిస్తున్నారు. కొందరు ఆయన స్పీచ్‌ని సీరియస్‌గా తీసుకుని — “ఇది కొత్త ఆలోచన, సైకలాజికల్ యాక్షన్ అంటే కొత్త ఎక్స్‌పీరియన్స్ అవుతుంది” అని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం ట్రోలింగ్ మోడ్‌లోకి వెళ్లారు. “తొడలు కొట్టడాలు, నరకడాలు ఉండవని అంటున్నావు అంటే ఏదైనా స్టార్ హీరోని టార్గెట్ చేస్తున్నావా?” అంటూ సరదాగా, కొందరు ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. కానీ సిద్ధు మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూసి సినిమా కంటెంట్‌పై ప్రజల్లో కుతూహలం పెరుగుతోంది.
ఈ చిత్రాన్ని నీరజాకోన దర్శకత్వం వహించగా, రాశీఖన్నా మరియు శ్రీనిధి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. టీ జీ విశ్వ ప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మాణంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందింది. టెక్నికల్‌గా, విజువల్‌గా కూడా ఈ మూవీ హై స్టాండర్డ్‌తో తెరకెక్కిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సిద్ధు చేసిన ఈ తాజా కామెంట్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీపావళి రేసులో “తెలుసు కదా” ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి..!!