టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున భార్య అయినటువంటి అమల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అమల తన కెరియర్లో ఎన్నో సినిమాలలో నటించింది. హీరోయిన్గా కెరియర్ను మొదలు పెట్టిన ఈమె కెరియర్ ప్రారంభంలోనే ఎన్నో మంచి మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఈమె హీరోయిన్గా నటిస్తున్న సమయంలో నాగార్జున హీరోగా రూపొందిన సినిమాలలో కూడా నటించింది. అలా వీరిద్దరూ కలిసి సినిమాలు చేస్తున్న సమయం లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత వీరు వివాహం చేసుకున్నారు.

వీరి వివాహం అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా వీరు ఎంతో అన్యోన్యంగా , ఆనందంగా తమ సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నాగార్జున కు అమల రెండవ భార్య. నాగార్జున కు మొత్తం ఇద్దరు సంతానం. అందులో ఒకరు మొదటి భార్యకు కాగా , మరొకరు అమలకు. నాగార్జున మొదటి భార్యకు నాగ చైతన్య జన్మించగా , రెండవ భార్య అయినటువంటి అమల కు అఖిల్ జన్మించాడు. ఇక ప్రస్తుతం వీరందరూ కలిసి ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు. తాజాగా అమల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా తన ఇద్దరు కోడళ్ళ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అమల చెప్పుకొచ్చింది. అక్కినేని నాగ చైతన్య నటి అయినటువంటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకోగా  , అఖిల్ , జైనాబ్ రావ్జీ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరి సంసార జీవితాలు కూడా ఎంతో ఆనందంగా ముందుకు సాగుతున్నాయి.

తాజాగా అమల తన ఇద్దరు కోడళ్ళ గురించి మాట్లాడుతూ ... నా ఇద్దరూ కోడళ్ళు ఎంతో మంచి వారు. నా కోడలు ఇద్దరు కూడా చాలా బిజీగా ఉంటారు. దాని వల్ల నేను వారితో ఎక్కువ సమయం గడపకపోయినా గడిపిన ప్రతి క్షణం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది. వారి వల్ల నా గుర్తింపు సమాజంలో మరింత గొప్పగా పెరిగిపోయింది. అలాంటి కోడళ్ళు నాకు దొరకడం నా అదృష్టం అని తాజాగా అమల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: