ఒక చ‌క్క‌ని ఆలోచ‌న సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది.. ఒక స‌రైన విజ‌న్ విజ‌య తీరాల‌కు తీసుకెళుతుంది..ఒక ముందుచూపు అద్భుతాలు ఆవిష్క‌రిస్తుంది.. ఒక మార్గ‌ద‌ర్శి జీవన గమనాన్ని నిర్దేశిస్తుంది.. బాహుబలి సినిమా రెండు భాగాలను ఒక భాగంగా చేసి రిలీజ్ చేయాలన్నది కూడా అలాంటి ఐడియానే.

ఇండియన్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెర‌కెక్కించిన ‘బాహుబలి’ ప్రాజెక్టుకు సంబంధించి రెండు భాగాలను కలిపి ఒకే సినిమా రూపంలో ‘బాహుబలి: ది ఎపిక్‌’ (Baahubali The Epic 2025) పేరుతో అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

అయితే ఈ ఆలోచ‌న‌ల ఏడేళ్ల‌ క్రిత‌మే లాయిడ్ గ్రూప్స్ అధినేత, ధనిక భారత్ విజన్ సృష్టి కర్త విక్రం నారాయణ రావు సూచించారు. 2017 మే 6న ఆయన ఎక్స్ లో రాజమౌళిని ట్యాగ్ చేస్తూ – “బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఒకే సినిమాలా రిలీజ్ చేయండి. ఇది ఇప్పటి వరకు సినిమా చరిత్రలో జరగని అద్భుతం అవుతుంది. కనీసం 500 కోట్ల రూపాయల వసూళ్లు సాధించే అవకాశం ఉంది. అలాగే ప్రేక్షకులకు మరో మాయాజాలమైన అనుభవం ఇవ్వవచ్చు” అని సూచించారు.

‘బాహుబలి 2’ విడుదలైన వారం రోజుల‌కే విక్రం నారాయణ రావు ఈ పోస్టు చేశారు. పదేళ్ల తర్వాత ఆ ఆలోచ‌న‌ను రాజ‌మౌళి నిజం చేస్తుండ‌టంతో, విక్రం నారాయణ రావు గారు ఏడేళ్ల‌ క్రిత‌మే చేసిన ఈ ఆలోచ‌న‌పై ప‌లువురు అభినందిస్తున్నారు. అటు వ్యాపార రంగంలోనే కాదు ఇటు సినిమా రంగంలోనూ విజ‌న్ ఉన్న లీడ‌ర్‌గా విక్రం నారాయణ రావు గుర్తింపు తెచ్చుకున్నారు.




వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: