కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా సెన్సేషన్ ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించి.. ఇంకా దూసుకుపోతోంది. సినిమా విడుదలై మూడు వారాలు అయినా దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఇంకా తగ్గలేదు. మొదటి వారం నుంచే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా.. ప్రతి వారం తన దూకుడును కొనసాగిస్తూ రికార్డుల వేట కంటిన్యూ చేస్తోంది. ప్రత్యేకంగా హిందీ మార్కెట్‌లో ఈ సినిమా దుమ్మురేపుతోంది. కన్నడలో రూపొందిన కాంతారా చాప్టర్ 1 హిందీ వెర్షన్ ద్వారా బాలీవుడ్‌లోనే కాదు, ఉత్తర భారత ప్రాంతాల్లోనూ సంచలనం రేపింది. తాజాగా ఈ సినిమా హిందీ వెర్షన్ కలెక్షన్స్ రూ.175 కోట్ల మార్క్‌ను దాటి, ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది.
కన్నడ లాంగ్వేజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇంతటి విజయాన్ని సాధించడం చాలా అరుదైన విషయం. ఇది రిషబ్ శెట్టి సృష్టించిన మాంత్రిక ప్రపంచం, కథా నిర్మాణం, సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో మాత్రం ‘ కాంతార చాప్టర్ 1 ’కి హిందీ బాక్సాఫీస్‌లో కొంత పోటీ ఎదురవనుంది. ఈ వారం రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించిన ‘థామా’, అలాగే రొమాంటిక్ థ్రిల్లర్ ‘ఏక్ దీవానే కి దీవానియత్’ సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. వీటి వల్ల ‘కాంతార’ డ్రీమ్ రన్‌కు స్వల్పంగా ఆటంకం కలిగే అవకాశం ఉందని బీ-టౌన్ ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నారు.
ఇప్పటికే మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ విజయ పరంపరను దృష్టిలో ఉంచుకుంటే, రిషబ్ శెట్టి సృష్టించిన కాంతారా 1 ప్రభావం ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ప్రేక్షకులు కథలోని మిస్టిక్ ఎలిమెంట్స్, నేటివిటీ, మ్యూజిక్ అన్ని కలిపి ఇష్టపడుతున్నందున ‘కాంతార చాప్టర్ 1’ను బాక్సాఫీస్ వద్ద మరి కొంత కాలం ప్రభావం చూపనుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.