ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హాట్ న్యూస్ ఇదే.  గ్లోబల్ హీరో రామ్ చరణ్ కి ఒక స్టార్ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చాడని సోషల్ మీడియా కోడై కూస్తుంది.  ఈ న్యూస్ ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చగా మారింది. రామ్ చరణ్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, రిస్పెక్ట్ అన్నీ అద్భుతం. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్, మొదటి సినిమాతోనే తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.ఆయన మొదటి సినిమా ‘చిరుత’. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు కొత్త హీరోగా పరిచయమైన చరణ్, తన మొదటి అడుగు నుంచే పెద్ద అంచనాలను మోసుకెళ్లాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది  స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఎనర్జీ ఫుల్ డైరెక్షన్, పంచ్ డైలాగ్స్, మాస్ యాక్షన్ అంటే పూరి జగన్నాథ్ స్టైల్ అందరికీ తెలిసిందే. సినిమా షూటింగ్ సమయంలో ఒక చిన్న ఇన్సిడెంట్ చోటుచేసుకుందట. సినిమా క్లైమాక్స్‌లో ఉన్న కొన్ని యాక్షన్ సీన్స్ చాలా టఫ్ గా ఉండేవి. వాటిని పర్ఫెక్ట్‌గా తీసే వరకు పూరి జగన్నాథ్ మళ్లీ మళ్లీ షాట్స్ తీస్తూ ఉండేవారట. ఆ సమయంలో చరణ్ కొత్తవాడు కావడంతో ఫిజికల్‌గా చాలా టైడ్ అయిపోయాడట. రెండు మూడు షాట్స్ రిపీట్ చేయమని చెప్పడంతో చరణ్ కి కోపం వచ్చి రెండు రోజులు షూటింగ్ కి వెళ్లలేదని అప్పట్లో ఇండస్ట్రీ టాక్.

ఈ విషయంపై పూరి జగన్నాథ్ బాగా సీరియస్ అయ్యారట. ఆయన నేరుగా చరణ్ ని పిలిచి —“నువ్వు స్టార్ అవ్వాలంటే కష్టపడాలి. నీ నాన్న పేరు గౌరవం కాపాడాలి. ఇలా ప్రవర్తిస్తే ఇండస్ట్రీలో నిలవలేవు”అని గట్టిగా హెచ్చరించారట.ఆ సమయంలో చరణ్ కి ఇది బిగ్ షాక్ లా ఉన్నిందత. ఎందుకంటే అప్పటివరకు ఆయన చాలా ఫ్రీ గా తిరిగిన ఉన్న వ్యక్తి. కానీ సినిమా ప్రపంచం అంటే ఎంత కష్టమైనది, ఎంత డిసిప్లిన్ అవసరమో అప్పుడే గ్రహించాడట.తర్వాత పూరి చెప్పిన మాటలు మనసులో వేసుకుని, చరణ్ తన యాక్టింగ్ లో, డెడికేషన్ లో పూర్తిగా మారిపోయాడు. తాను ఎంత కష్టపడ్డాడో ఫలితం చూపించింది. ‘చిరుత’ సినిమా మంచి హిట్ అయి, చరణ్ కి ఫస్ట్ మూవీతోనే స్టార్డమ్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘మగధీర’ అయితే ఆయన కెరీర్‌ను సెకండ్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ పాత న్యూస్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్లు “పూరి వల్లే చరణ్ డిసిప్లిన్ నేర్చుకున్నాడు, ఆయన సక్సెస్ కి అదే బేస్” అంటుంటే, మరికొందరు “ఇలా వార్నింగ్ ఇవ్వడం వల్ల మెగా ఫ్యామిలీ ఇమేజ్ కి డ్యామేజ్ వచ్చింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ ఒక ముఖ్యమైన పాయింట్ ని రివీల్ చేసింది —“సక్సెస్ అంటే కేవలం టాలెంట్ కాదు, కష్టపడటం, వినయం, మరియు సరైన మార్గదర్శకత్వం కూడా అవసరం” అని చెప్పింది. ఇప్పుడు రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ గా ఎదిగి ఆర్ ఆర్ ఆర్..గేమ్ ఛేంజర్  వంటి భారీ ప్రాజెక్ట్స్ తో ప్రపంచ స్థాయిలో తన ముద్ర వేసుకున్నాడు. కానీ ఈరోజు ఆయన ఉన్న స్థాయికి బేస్ వేసింది అదే “చిరుత” టైమ్‌లో జరిగిన ఆ సంఘటన అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: